Begin typing your search above and press return to search.

అమెరికా స్టాక్ మార్కెట్ లోకి ‘‘నీళ్లు’’

By:  Tupaki Desk   |   13 Dec 2020 3:52 AM GMT
అమెరికా స్టాక్ మార్కెట్ లోకి ‘‘నీళ్లు’’
X
నీళ్లను అమ్ముకోవటం మొదలై చాలా కాలమే అయ్యింది. తాజాగా ప్రపంచ గతిని మరో దరిద్రపుగొట్టు దిశగా అడుగులు వేసే ప్రయత్నం ఒకటి తాజాగా అగ్రరాజ్యమైన అమెరికాలో మొదలైంది. ఇప్పటివరకు ముడి చమురు.. బంగారం.. వెండి.. లాంటి విలువైన లోహాల సరసన.. నీళ్లను ట్రేడింగ్ కు అనుమతిస్తూనిర్ణయం తీసుకున్నారు. తాజాగా అమెరికాలోని షికాగోకు చెందిన సీఎంఈ గ్రూపు వాల్ స్ట్రీట్ ఫ్యూచర్స్ ట్రేడింగ్ లో నీటిని కూడా చేర్చటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తాజాగా చోటుచేసుకుంటున్న మార్పులు.. వాతావరణ మార్పులతో పాటు.. నీటి ఎద్దడి.. ప్రపంచ వ్యాప్తంగా నీళ్ల ధరలు పెరిగిపోతునన నేపథ్యంలో.. నీటి ట్రేడింగ్ ను షురూ చేయాలని నిర్ణయించారు. కరవు.. అడవులు తగలబడిపోవటంతో.. కాలిఫోర్నియాలో నీటి ధరలు ఏడాదిలో రెట్టింపు అయ్యాయి. తాజాగా ట్రేడింగ్ షురూ చేసిన సీఎంఈ కంపెనీ కాలిఫోర్నియాలో నీటి సరఫరాకు కాంట్రాక్టును సంపాదించుకుంది. దీంతో.. ట్రేడింగ్ మొదలు పెట్టారు.

దీంతో.. మిగిలిన లోహాల మాదిరే.. అనునిత్యం నీటిపైనా ట్రేడింగ్ జరపున్నారు. స్టాక్ మార్కెట్లో నీటిని స్టాక్ వస్తువుగా మార్చటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. అయితే.. ఇలాంటి తీరుతో ప్రణాళికా బద్ధంగా నడుచుకోవటానికి వీలు అవుతుందని చెబుతున్నారు. ఏమైనా.. నీళ్లను వ్యాపారం చేసే పాడు రోజులు వచ్చాయనుకుంటే.. ఇప్పుడుమరో అడుగు ముందుకు వేసి.. నీటిని ట్రేడింగ్ వస్తువుగా మార్చేయటంతో.. రానున్న రోజుల్లో మరెన్ని దరిద్రాలు తెర మీదకు తీసుకొస్తున్నట్లుగా చెప్పకతప్పదు. కనీస మానవ హక్కు అయిన నీళ్లను కూడా పెట్టుబడిదారుల చేతిలో పెట్టేస్తారా? అన్న మాట వినిపిస్తుండటం గమనార్హం.