Begin typing your search above and press return to search.

హర్యానా లొల్లితో ఢిల్లీ స్కూళ్లకు సెలువు

By:  Tupaki Desk   |   21 Feb 2016 9:00 AM GMT
హర్యానా లొల్లితో ఢిల్లీ స్కూళ్లకు సెలువు
X
తమను ఓబీసీల్లో చేర్చాలన్న డిమాండ్ తో మొదలైన జాట్ల ఆందోళన తీవ్రరూపం దాల్చటం తెలిసిందే. హింసాత్మకంగా మారిన జాట్ల ఆందోళన కారణంగా ఇప్పటికే హర్యానా రాష్ట్రం అట్టుడిగిపోతోంది. గడిచిన రెండు రోజుల్లో ఆ రాష్ట్రంలో పరిస్థితులు అంతకంతకూ దిగజారిపోతున్నాయి. హింసాత్మక ఘటనలకు చెక్ చెప్పిసాధారణ పరిస్థితులు నెలకొల్పటానికి సైన్యం రంగ ప్రవేశం చేసింది. హర్యానాకు సైన్యాన్ని తరలించటమే పెద్ద ప్రయాసగా మారిన పరిస్థితి.

రైళ్లు.. రహదారులపై ఆందోళనకారుల పట్టు పెరగటంతో సైన్యాన్ని పంపేందుకు హెలికాఫ్టర్లను వినియోగించాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే.. హర్యానాలో జరుగుతున్న ఆందోళనలు.. పక్కనున్న రాష్ట్రాలతో పాటు.. దేశ రాజధాని ఢిల్లీ మీద ప్రభావాన్ని చూపిస్తున్నారు. ఢిల్లీలో తాగునీరు కొరత తీవ్రతరమైంది. హర్యానాలో చోటుచేసుకున్న పరిణామాలతో తాగునీటి కొరత ఎక్కువ కావటంతో ఢిల్లీ రాష్ట్ర సర్కారు రియాక్ట్ అయ్యింది.

తాజా పరిస్థితుల దృష్ట్యా ఢిల్లీ స్కూళ్లకు సోమవారం సెలవు ప్రకటించారు.అంతేకాదు.. సోమవారం నిర్వహించాల్సిన పరీక్షల్ని సైతం వాయిదా వేశారు. ఇప్పుడున్న పరిస్థితే కానీ మరో రెండు..మూడు రోజులు కొనసాగితే కూరగాయలు.. పండ్లు.. నిత్యవసర వస్తువల విషయంలో ఢిల్లీ ప్రజలకు తిప్పలు తప్పవని చెబుతున్నారు. చూస్తుంటే.. హర్యానా ఆందోళన.. ఢిల్లీ నగర ప్రజల గొంతుకు చుట్టుకున్నట్లైంది.