Begin typing your search above and press return to search.

బిరబిరా కృష్ణమ్మ.. రైతాంగానికి ఆనందం!

By:  Tupaki Desk   |   8 Aug 2019 1:30 PM GMT
బిరబిరా కృష్ణమ్మ.. రైతాంగానికి ఆనందం!
X
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలు అక్కడి వారిని కొంత వరకూ ఇక్కట్ల పాల్జేస్తున్నా - దిగువన మాత్రం నీటి కరువును తీర్చేలా ఉన్నాయి. ఈ ఏడాది రుతుపవన కాలం ఆరంభంలో ఏ మాత్రం ఆశాజనక పరిస్థితి లేకపోయినా - ఇప్పుడు మాత్రం ఊరట లభిస్తూ ఉంది.

కృష్ణ నదికి పూర్తి స్థాయిలో నీటి అభ్యత కనిపిస్తోంది. ఇది ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి శుభ పరిణామం అని చెప్పవచ్చు. గత వారం రోజులుగా కృష్ణా నదికి పుష్కలమైన వరద సాగుతూ ఉంది. కర్ణాటకలోని ఆల్మట్టి - నారాయణ్ పూర్ జలాశాయాల గేట్లు ఎత్తక తప్పని పరిస్థితుల్లో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద నీరు చేరుతూ ఉంది.

శ్రీశైలం ప్రాజెక్టు దాదాపుగా గరిష్ట మట్టానికి చేరువైందని అధికారిక వర్గాలు ప్రకటిస్తున్నాయి. పూర్థి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా - ఇప్పటి వరకూ 874 అడుగుల వరకూ నీరు ఉన్నట్టుగా అధికారులు ప్రకటించారు. అలాగే శ్రీశైలం డ్యామ్ ఆధారిత సాగు నీటి ప్రాజెక్టులకు కూడా నీటి విడుదల సాగుతూ ఉంది. వరద ఉదృతి మరింతగా ఉంటుందనే అంచనాలున్నాయి.

ఈ నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను కూడా ఎత్తబోతున్నారని తెలుస్తోంది. కాస్త ఆలస్యం గా అయినా వరద నీటి లభ్యతతో ఈ ప్రాజెక్టులపై ఆధారపడిన ప్రాంత రైతులకు ఊరట లభిస్తూ ఉంది.