Begin typing your search above and press return to search.
వైరల్ గా మారిన సచివాలయం వీడియో.. వర్షం నీటిని తోడి పోయటమా?
By: Tupaki Desk | 3 May 2023 4:49 PM GMTమిలమిల మెరిసే పాలరాయి మాదిరి.. అమెరికా అధ్యక్షుడి శ్వేత సౌధం స్ఫూర్తిగా.. తెలంగాణ వైట్ హౌస్ గా పిలుస్తున్న తెలంగాణ కొత్త సచివాలయానికి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు తెగ వైరల్ గా మారింది.ఈ చిట్టి వీడియోను చూసినోళ్లంతా ముక్కున వేలేసుకుంటున్నారు.
ఇదేంది కేసీఆర్.. ఇలా చేసుడేంది? అన్న ప్రశ్నను చటుక్కున నోటి నుంచి వచ్చేస్తోంది. అద్భుతమైన వంటకాలు చేశారు. అది కూడా.. అత్యుద్బుతమైన చెఫ్ లతో. కాకుంటే.. ఉప్పు వేయటమే మర్చిపోయారంటే ఎంత కామెడీగా ఉంటుందో.. అలాంటి పరిస్థితే కొత్త సచివాలయానికి ఉందంటున్నారు.
ఏప్రిల్ 30న తెలంగాణ కొత్త సచివాలయాన్ని పెద్ద ఎత్తున ప్రారంభించటం.. ఇందుకోసం భారీ ఎత్తున పూజలు.. కార్యక్రమాలతో సందడి సందడిగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాతి రోజుకు సిటీలో భారీ వర్షపాతం నమోదు కావటం తెలిసిందే.
ఆదివారం..సోమవారం రెండు రోజులు అనూహ్యంగా కురిసిన వర్షం నగరంలోని పలు ప్రాంతాల్ని ఆగమాగం చేసింది. అయితే.. వీటితో రూ.వెయ్యి కోట్లకు పైగా ఖర్చు చేసిన నిర్మించిన కొత్త సచివాలయంలో వంక పెట్టే అవకాశమే ఉండదని భావించారు.
కానీ..లీకులతో షాకులు తగిలాయి. అంత భారీ భవంతి అన్న తర్వాత ఆ మాత్రం లోపాలు ఉండవా? అన్నసందేహం కలగొచ్చు. కానీ.. అలా ఎందుకు జరగాలి? భారీ ఎత్తున బిల్డింగ్ లు కట్టుకున్న వారికి లీకులు ఎదురవుతున్నాయా? అంటే లేదనే మాటే ఎవరి నోటి నుంచైనా వినిపిస్తుంది.మరి..అలాంటప్పుడు కొత్త సచివాలయంలో లీకులు ఎందుకు వచ్చాయి? అన్న ప్రశ్నకు సమాధానాలు రావు. ఇదిలా ఉంటే.. వర్షం కారణంగా సచివాలయం ప్రహరీ గోడ మీద పడిన వాన నీరు అలానే నిలిచిపోవటం.. ఇద్దరు వ్యక్తులు.. ఆ నీళ్లను తోడి రోడ్డు మీద పారబోస్తున్న వీడియో ఒకటి బయటకువచ్చి వైరల్ గా మారింది.
ఇంత భారీగా సచివాలయాన్ని నిర్మించి.. వర్షపు నీరు బయటకు వెళ్లే మార్గం లేకుండా ఎలా చేశారు? అన్న సందేహం కలుగక మానదు. ఇదే సమయంలో.. అద్భుతంగా కట్టినట్లుగా ప్రచారం జరిగిన యాదాద్రి టెంపుల్ కు సైతం వర్షం కురిసినప్పుడు వాన నీరు వెళ్లేందుకు తోవ లేక పడిన ఇబ్బంది అంతా ఇంతా కాదు.
నిర్మాణం పూర్తి అయి.. ఆలయాన్ని ప్రారంభించిన తర్వాత.. ఈ లోపం వెలుగు చూడటంతో దాన్ని అప్పటికప్పడు సరిచేశారు. అలానే సచివాలయంలోనూ అలాంటి సీనే ఎదురుకావటం ఆసక్తికరంగా మారింది.రానున్న రోజుల్లో ఈ తరహా లోపాలు మరెన్ని బయటకు వస్తాయో? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.