Begin typing your search above and press return to search.

అక్కడ.. శివలింగం నుంచి పాలు.. నీళ్లు

By:  Tupaki Desk   |   14 Dec 2015 11:27 AM IST
అక్కడ.. శివలింగం నుంచి పాలు.. నీళ్లు
X
ఇప్పుడో వింత పశ్చిమగోదావరి జిల్లా ప్రజల్ని విస్మయాన్ని కలిగిస్తోంది. జిల్లాలోని ఒక దేవాలయంలోని శివలింగం నుంచి పాలు.. నీళ్లు అదే పనిగా రావటం చర్చనీయాంశంగా మారింది. వింతైన ఈ విషయాన్ని ఇప్పుడు అందరూ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నెలమూరులోని శ్రీ ఉమా రామలింగేశ్వరస్వామి ఆలయంలో ఈ అరుదైన వింత చోటు చేసుకుంది.

ఎవరి ప్రమేయం లేకుండానే.. శివలింగం నుంచి పాలు.. నీళ్లు ఉబికి వస్తున్నాయి. దీంతో ఈ విషయం వేగంగా వ్యాప్తి చెందింది. ఈ ఆశ్చర్యఘటన చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున దేవాలయానికి వస్తున్నారు. ఎవరు పోయకుండానే పాలు.. నీళ్లు ఉబికి రావటంపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా దేవుడి లీలగా కొందరు భావిస్తుంటే.. అలాంటిదేమీ ఉండదని.. నిత్యం లింగం మీద పాలు..నీళ్లతో అభిషేకం చేసే నేపథ్యంలో.. రాయి స్వభావంతో ఇలాంటిది జరిగి ఉండొచ్చని.. ఏదైనా పగులు కారణంగా లింగంలోకి వెళ్లిన పాలు..నీళ్లు.. ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

శివలింగం నుంచి పాలు.. నీళ్లు ఎలా వస్తున్నాయని చెప్పేందుకు శాస్త్రీయంగా ఎవరూ పరీక్షలు నిర్వహించకపోవటంతో ప్రజలు భారీగా ఈ వింత గురించి మాట్లాడుకుంటూ.. దేవాలయంలోని దీన్ని చూసేందుకు పెద్ద ఎత్తున వస్తున్నారు.