Begin typing your search above and press return to search.

ఫోన్ లో పోర్న్ వీడియోలతోనే సగం మోసాలు?

By:  Tupaki Desk   |   29 July 2020 1:30 AM GMT
ఫోన్ లో పోర్న్ వీడియోలతోనే సగం మోసాలు?
X
చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే ఈ చాలు ఈ ప్రపంచం మీ వెంటే ఉంటుంది. తాజా అప్ డేట్స్ అన్నీ ఫోన్లో చూసేయచ్చు. స్మార్ట్ ఫోన్ వచ్చాక పోర్న్ కూడా ఎక్కువైంది. అందరూ ఫోన్లోనే సెక్స్ వీడియోలను చూసేస్తున్నారు. క్రేజ్ ఉన్న ఈ పోర్న్ ను ఫోన్లో చూసేవారికి హెచ్చరికలాంటి వార్త ఇదీ..

తాజాగా అమెరికన్ సాఫ్ట్ వేర్ నిపుణుల బృందం వెలువరించిన నివేదిక అందరినీ షాక్ కు గురిచేసింది.. కంప్యూటర్ కంటే ఆండ్రాయిడ్ ఫోన్లో పోర్న్ వీడియోలు చూస్తే చాలా రిస్క్ అట.. ప్రపంచవ్యాప్తంగా 25శాతం మాల్ వేర్, వైరస్ లు పోర్న్ వెబ్ సైట్స్ ద్వారానే వ్యాప్తి చెందుతున్నాయట.. దీనివల్ల మన బ్యాంకుల పాస్ వర్డ్స్, ఏటఎం పిన్ నంబర్లు, సహా చాలా కీలకమైన పాస్ వర్డ్స్, మన ఫోన్లో పర్సనల్ డేటా, పొటోలు, వీడియోలు మొత్తం ఆన్ లైన్ లో మన స్మార్ట్ ఫోన్ లోంచి హ్యాక్ పోతాయట..

ఆండ్రాయిడ్ లో ఫోన్ చూసే వాళ్లందరూ ఖచ్చితంగా తమ లోకేషన్ ను ఆఫ్ చేసుకోవాలట.. లోకేషన్ ఆన్ చేసుకుంటూ బ్రౌజర్ ద్వారా మన డేటా గల్లంతు అవుతుందట.. పోర్న్ చూసేటప్పుడు తప్పనిసరిగా పెద్ద బ్రౌజర్లనే వాడాలని.. నాక్స్ వంటి ఫీచర్లు ఉపయోగించాలని బాగా పాపులర్ సైట్లు మాత్రమే చూస్తే ఈ ముప్పు తప్పుతుందని అంటున్నారు.