Begin typing your search above and press return to search.

తాగుబోతు వీరంగాన్ని దాడి వార్తగా చేశారు

By:  Tupaki Desk   |   28 March 2016 4:19 PM GMT
తాగుబోతు వీరంగాన్ని దాడి వార్తగా చేశారు
X
కీలక సమయాల్లో ఆలసత్వం ఏ మాత్రం మంచిది కాదు. అలాంటిది చోటు చేసుకుంటే జరిగే నష్టం భారీగా ఉంటుంది. సున్నితమైన అంశాల విషయంలో లేనిపోని రచ్చకు తావివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవటం లాంటివి సదరు వ్యక్తి పరిణితిని స్పష్టం చేస్తుంది. తాజాగా అలా వ్యవహరించి అందరి మన్ననలు అందుకుంటున్నారు పాక్ మాజీ కెప్టెన్ వాసిం అక్రం. తాజాగా ఆయనకు ఒక చేదు అనుభవం ఎదురైనా.. దాన్ని సంచలనంగా చేసే కన్నా హుందాగా వ్యవహరించిన వైనం బాగుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

భారత్ – ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ గురించి ఒక టీవీ చానల్ లో లైవ్ లో మాట్లాడుతుండగా.. ఒక తాగుబోతు వీరంగం వేశాడు. ఇదిలా ఉంటే.. సదరు ఘటన మీద పాక్ మీడియా చాలా వేగంగా స్పందించింది. వాసీం అక్రమ్ మీద దాడి జరిగిదంటూ హోరెత్తించింది. ఈ వార్త పాక్ లో సంచలనంగా మారి.. ఉద్రిక్తతలకు దారి తీసే అవకాశాన్ని కలిగించింది.

ఈ విషయాన్ని తెలుసుకున్న వాసీం అక్రం అసలు విషయాన్ని ఏ మాత్రం ఆలస్యం చేయకుండా క్షణాల మీద స్పందించారు. తన మీద ఎవరూ దాడి చేయలేదని.. అభిమానులు ఆందోళన చెందొద్దంటూ ట్విట్టర్ లో ట్వీట్ చేసి.. పాక్ మీడియా హడావుడికి కళ్లాలు వేశారు. తన మీద దాడి జరగలేదని.. తాగుబోతు వీరంగంగా స్పష్టం చేయటం ద్వారా అనవసర పరిణామాలకు ఏమాత్రం అవకాశం వాసీం ఇవ్వలేదు. దీన్ని అందరూ అభినందించాల్సిన అంశం కదూ.