Begin typing your search above and press return to search.

భారత్ లో రాబోయే రోజులు ఎంత దారుణంగా ఉంటాయో చెప్పిన వాషింగ్టన్ వర్సిటీ!

By:  Tupaki Desk   |   28 April 2021 10:30 AM GMT
భారత్ లో రాబోయే రోజులు ఎంత దారుణంగా ఉంటాయో చెప్పిన వాషింగ్టన్ వర్సిటీ!
X
రోజుకు 3.5లక్షలకు పైనే నమోదవుతున్న కరోనా కొత్త కేసులు.. మూడు వేల వరకు మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ మాత్రం దానికే శశ్మానాలు సరిపోకపోవటం.. దహన సంస్కారాల కోసం గంటల తరబడి వెయిట్ చేయాల్సి రావటం లాంటి దుస్థితి. రోజులు గడిచే కొద్దీ పరిస్థితులు మరింత ఇబ్బందికరంగా మారుతున్న వేళ.. రానున్న రోజుల్లో ఎలా ఉంటుంది. మే లో కేసుల నమోదు తీవ్రంగా ఉండటంతో పాటు మరణాలు మరింత ఎక్కువగా ఉంటాయని చెబుతున్న వేళ.. భారత్ లోని పరిస్థితుల్ని మదింపు చేసింది వాషింగ్టన్ వర్సిటీకి చెందిన ఇన్ స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్స్ విభాగం.

రానున్నరోజుల్లో భారత్ లో చోటు చేసుకునే పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మే రెండో వారంలో భారత్ లో రికార్డు స్థాయి మరణాలు నెలకొనే అవకాశం ఉందన్న బాంబు పేల్చింది. ఈ సంస్థ అంచనాల ప్రకారం మే రెండో వారంలో భారత్ లో రోజుకు 13వేల వరకు కొవిడ్ మరణాలు చోటు చేసుకునే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ అంకె వింటేనే వణుకు పుట్టేలా ఉందని చెప్పాలి. ఇప్పటికి రోజుకు మూడు వేల లోపే ఉన్నాయి. అంటే.. ఇప్పడు నమోదవుతున్న మరణాలకు దాదాపు నాలుగైదు రెట్లు ఎక్కువగా నమోదు కావటం అంటే.. పరిస్థితి మరెంత భయానకంగా మారుతుందో ఊహించటానికే కష్టంగా ఉందని చెప్పాలి.

ఒకవేళ.. ఈ అంచనా కానీ నిజమైతే.. భారత్ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. మరి.. ఈ అంచనాను కేంద్రంసీరియస్ గా తీసుకుంటుందా? పట్టించుకోదా? అన్నది ప్రశ్న. ఏమైనా.. రాబోయే రోజులు భారత్ లో పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయనటానికి ఇదో చక్కటి ఉదాహరణగా మారుతుందని చెప్పక తప్పదు.