Begin typing your search above and press return to search.
మ్యాచ్ మొదలయ్యాక అతడికి ప్యాడ్ లు కొన్నారట!!
By: Tupaki Desk | 24 Jan 2021 9:30 AM GMTఅతడు టీమిండియా జట్టు సభ్యుడు. అనూహ్యంగా టెస్టు మ్యాచ్ ఆడాల్సిన పరిస్థితి. అంతా ఓకే అనుకున్నాక.. మ్యాచ్ మొదలైన తర్వాత అతగాడికి సరిపోయే తెల్లటి ప్యాడ్ లు లేవన్న విషయాన్ని గుర్తించటమే కాదు.. అప్పటికప్పుడు కొనుగోలు చేసేందుకు పరుగులు తీయాల్సిన పరిస్థితి ఉంటుందని ఊహిస్తారా? కానీ.. ఇది నిజం. తాజాగా ఆసీస్ తో జరిగిన గాబా టెస్టు మ్యాచ్ లో బరిలోకి దిగటం.. తన తొలి టెస్టు మ్యాచ్ లోనే అర్థ శతకాన్ని సాధించిన ఆల్ రౌండర్ వాష్టింగ్టన్ సుందర్ విషయంలో ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఇంతకీ ఈ విషయాన్ని ఎవరు చెప్పారంటారా? అక్కడికే వస్తున్నాం. ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ తాజాగా ఈ విషయాన్ని వెల్లడించారు. అసలేం జరిగిందన్నది చూస్తే..
గాబా టెస్టుకు సుందర్ ఎంపికయ్యారు. అప్పటివరకు అతడు పరిమిత ఓవర్ల క్రికెట్ కు మాత్రమే ఎంపికైన ఆటగాడు. దీంతో.. అతడికి సరిపోయే కలర్ ప్యాడ్స్ మాత్రమే ఉన్నాయి. టెస్టు మ్యాచ్ కు తెల్లటి ప్యాడ్స్ అవసరం. సుందర్ పొడుగ్గా ఉండటంతో అతడికి సూట్ అయ్యే ప్యాడ్స్ జట్టు సభ్యుల వద్ద లేదు. సరేనని.. ఆస్ట్రేలియా క్రికెట్ టీంలోని వారిని అడిగినా.. వారి వద్దా లేని పరిస్థితి.
ఇంత ఇబ్బంది ఎందుకు? మొదటే ఎందుకు సిద్ధం చేసుకోనట్లు? అన్నక్వశ్చన్ రావొచ్చు. వన్డే.. టీ20 మ్యాచులకు మాత్రమే అతడు ఆడే అవకాశం ఉంటుందని భావించటమే కారణం. అనూహ్యంగా టెస్టు మ్యాచ్ లో ఆడే అవకాశం రావటంతో.. అతడి ప్యాడ్ సమస్య ఎదురైంది. దీంతో.. మ్యాచ్ ప్రారంభమయ్యాక అప్పటికప్పుడు అతడికి సూట్ అయ్యే ప్యాడ్ లు కొనుక్కొచ్చారు. ఈ విషయాల్ని తాజాగా ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ స్వయంగా వెల్లడించటంతో వివరాలు బయటకువచ్చాయి.