Begin typing your search above and press return to search.

వాషింగ్టన్​ అల్లర్లు.. పోలీస్​ ఉన్నతాధికారి రాజీనామా? బైడెన్​ వర్గం ఒత్తిడే కారణమా?

By:  Tupaki Desk   |   8 Jan 2021 5:30 AM GMT
వాషింగ్టన్​ అల్లర్లు.. పోలీస్​ ఉన్నతాధికారి రాజీనామా?  బైడెన్​ వర్గం ఒత్తిడే కారణమా?
X
ఇటీవల అమెరికా రాజధాని వాషింగ్టన్​లో తీవ్ర అల్లర్లు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ అల్లర్లకు నైతిక బాధ్యత వహిస్తూ పోలీసు ఉన్నతాధికారులు ఒక్కొక్కరుగా వైదొలుగుతున్నారు. డొనాల్డ్​ ట్రంప్​ తన పదవి నుంచి హుందాగా తప్పుకోకుండా అనేక అడ్డంకులు సృష్టించారు. ఎన్నికల ఫలితాలు మార్చాలంటూ అధికారులకు ఒత్తిడి చేశాడు. అంతేకాక వైట్​హౌస్​లో తనకు అనుకూలంగా ఉన్న పోలీస్​ ఉన్నతాధికారుల సహకారంతో అల్లర్లకు ప్రోత్సహించాడన్న ఆరోపణలు వచ్చాయి. ట్రంప్​ హుందాగా తప్పుకోవాలని.. అధికార మార్పిడికి సహకరించాలని పలువురు అధికారులు ఆయనకు సూచించారు. కానీ ట్రంప్​ మాత్రం అందుకు సహకరించడం లేదన్న ఆరోపణలు వచ్చాయి.

అయితే ఇటీవల వాషింగ్టన్​ డీసీలో ట్రంప్​ మద్దతుదారులు అల్లర్లు సృష్టించారు. ఆందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో డెమొక్రాట్ పార్టీ నాయకులు, బైడెన్​ మద్దతు దారులు పోలీసులపై విమర్శలు గుప్పించారు. కొందరు పోలీసు అధికారులు ట్రంప్​కు మద్దతుగా వ్యవహించారని వాళ్లు ఆరోపించారు. ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్టెఫానీ గ్రీషం ఇప్పటికే రాజీనామా చేశారు. తాజాగా వాషింగ్టన్ యూఎస్ కేపిటల్ బిల్డింగ్ పోలీస్ ఉన్నతాధికారి స్టీవెన్ సండన్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. వాషింగ్టన్​ డీసీలో జరిగిన అల్లర్లకు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసినట్టు ఆయన ప్రకటించారు.

ఈ నెల 16 నుంచి ఆయన రాజీనామా అమల్లోకి రానున్నది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘యూఎస్​ కేపిటల్​ బిల్డింగ్​ పోలీస్​ చీఫ్​గా పనిచేయడం నా అదృష్టం. నా 30 ఏళ్ల సర్వీస్​లో ఎప్పుడూ ఇటువంటి అల్లర్లు సాగలేదు. ఇది నా కెరిర్​లో ఓ చేదు జ్ఞాపకం. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో క్షేత్రస్థాయి పోలీసులు చాలా బాగా పనిచేశారు. అందుకే అల్లర్లను చాలా వరకు ఆపగలిగారు’ అని స్టీవెన్​ చెప్పుకొచ్చారు. ఏది ఏమైనప్పటికీ అధికార మార్పిడి సమయంలో అగ్రరాజ్యం అమెరికాలో అల్లర్లు కొనసాగడం చూసి యావత్​ ప్రపంచమే ఆశ్చర్యపోయింది.