Begin typing your search above and press return to search.
టీడీపీని భ్రష్టు పట్టించింది ఆ మాజీ మంత్రేనా.?
By: Tupaki Desk | 25 Aug 2020 8:30 AM GMTపాతకాపులు... ఔట్ డేటెడ్ రాజకీయ నాయకులు.. వింతడవాద మీడియా అధినేత మాటలు వినే చంద్రబాబు నిండా మునిగారని ఆయన ఓటమి తర్వాత కథలు కథలుగా చెప్పుకున్నారు. తిలాపాపం తలా పిడికెడు అన్నట్టు చంద్రబాబు వారందరినీ నమ్మి మునిగేశాడంటున్నారు. ఇంకా పార్టీలో కొనసాగుతున్న పాత చింతకాయపచ్చడి రాజకీయాలకు స్వస్తి పలకాలని లోకేష్ బ్యాచ్ పట్టుదలగా ఉందట..
టీడీపీలో మోస్ట్ సీనియర్ ఎవరైనా ఉన్నారంటే అందరూ చంద్రబాబు పేరే చెబుతారు. కానీ చంద్రబాబు కంటే సీనియర్లు ఆ పార్టీలో కొందరున్నారు. అందులో మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ముఖ్యుడు. కానీ యనమల చేసే సోషల్ ఇంజినీరింగ్ లెక్కలు పార్టీకి శాపాలుగా మారాయని.. చంద్రబాబుకి అంతా కలిసి తప్పుడు సలహాలు ఇచ్చినందునే టీడీపీ 23 సీట్లకు పరిమితమైపోయిందని లోకేష్ టీం నమ్ముతోందట..
ఉదాహరణకు రాయలసీమలో దాదాపు అన్ని సీట్లలో రెడ్డి సామాజికవర్గం ఆధిపత్యం ఉంది. కడప జిల్లాలో రెడ్డి సీటు అయిన మైదకూర్ లో యనమల వియ్యంకుడు ‘యాదవ్’కు ఇచ్చారు. ఆ సీటు అతడికి ఇచ్చేసరికి రెడ్డీలందరూ ఏకమయ్యారని.. లేకపోతే వైసీపీ అభ్యర్థి గెలిచేవాడు కాదని అంటున్నారు. వైసీపీ అభ్యర్థి మీద పూర్తిగా అక్కడ వ్యతిరేకత ఉందట.. కానీ కులపట్టింపులతో ఆయననే గెలిపించారట..
అలాగే ఉత్తరాంధ్రలో గోదావరి జిల్లాల్లో కూడా కుల సమీకరణాల ప్రకారం తప్పుడు సమాచారం ఇచ్చాడని.. లోకేష్ యూత్ టీం దాదాపు కన్ఫమ్ చేసిందట.. ఇప్పుడు ఇదే టీడీపీ వర్గాల్లో హాట్ హాట్ గా చర్చ జరుగుతోందని టాక్.