Begin typing your search above and press return to search.

వల్లభనేని వంశీ చేసిన పెద్ద మిస్టేక్ అదేనా?

By:  Tupaki Desk   |   22 Aug 2020 10:10 AM GMT
వల్లభనేని వంశీ చేసిన పెద్ద మిస్టేక్ అదేనా?
X
గన్నవరం టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. సీఎం జగన్ కు సపోర్టు చేసి రాజకీయం హీటెక్కించాడు. వైసీపీకి మద్దతుగా రాజకీయం చేస్తున్నాడు. అయితే వంశీ టీడీపీని వీడి వైసీపీలో చేరడం.. టీడీపీ హార్డ్ కోర్ నేతలకు మింగుడుపడడం లేదు. ఇక వైసీపీనే నమ్ముకొని ఉన్న అభిమానులు వంశీ రాకను స్వాగతించడం లేదు. ఈ క్రమంలోనే వంశీని ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా ఓడించాలని వైసీపీలోని రెండు గ్రూపులు.. టీడీపీలోని హార్డ్ కోర్ గ్రూపు బలంగా నిర్ణయించుకున్నాయా? అంటే ఔననే అంటున్నారు నియోజకవర్గంలోని నేతలు..

తాజాగా వల్లభనేని వంశీ మాటలు నియోజకవర్గంలో చిచ్చుపెట్టాయి. గన్నవరం నియోజకవర్గానికి నేనే ఎమ్మెల్యే.. నేనే వైసీపీ ఇన్ చార్జినంటూ చేసిన వ్యాఖ్యలు వైసీపీ వర్గాల్లో కలకలం రేపాయి. దీంతో వైసీపీనే నమ్ముకొని ఉన్న దుట్టా వర్గం ఏకంగా సీఎం వద్దనే ఈ పంచాయితీ తేల్చుకునేందుకు రెడీ అవుతోంది. అంతేకాదు.. ఇన్నాళ్లు విరోధులుగా వైసీపీలో ఉన్న యార్లగడ్డ వర్గాన్ని కూడా దుట్టా వర్గం చేరదీసి వీరిద్దరూ కలిసి వంశీకి చెక్ చెప్పాలని నిర్ణయించుకున్నారట..వంశీ కారణంగా అసలైన వైసీపీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని ఈ రెండు గ్రూపులు ఆరోపిస్తున్నాయి. అందుకే వంశీ తాజాగా పిలిచినా దుట్ట ఆయనతో కలిసి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనలేదు.

ఈ క్రమంలోనే వైసీపీలోని దుట్ట, యార్లగడ్డ వర్గం కలిసిపోతున్నాయట.. టీడీపీలోని హార్డ్ కోర్ అభిమానులు కూడా వంశీకి వ్యతిరేకంగా తయారవుతున్నాయి. ఒక వేళ ఉప ఎన్నికలొస్తే వంశీని ఎలాగైనా ఓడించాలని వీరంతా ఫిక్స్ అయ్యారని నియోజకవర్గంలో అనుకుంటున్నారు. వంశీ నెగ్గడం అసాధ్యం అంటున్నారు.

ఇక వంశీ తాజాగా చంద్రబాబు, లోకేష్ ను తిట్టడం వరకు ఓకే.. కానీ కమ్మ సామాజికవర్గానికి చెందిన వంశీ అదే సామాజికవర్గం వ్యక్తులపై నోరుపారేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది.. రమేశ్ హాస్పిటల్ వ్యవహారంలో హీరో రామ్ పై చేసిన కామెంట్స్ తో కమ్మ వర్గంలోనూ వంశీ మీద వ్యతిరేకత పెంచడానికి కారణమయ్యాట.. కుల ప్రస్తావన తెచ్చి వంశీ పొరపాటు చేశాడని అంటున్నారు.

ఇలా వంశీ అందరితో సున్నం పెట్టుకుంటూ తన సొంత సామాజికవర్గం మద్దతు కూడా దూరం చేసుకుంటున్నాడని.. ఎన్నికలు జరిగితే ఆయనకు కష్టకాలం తప్పదని నియోజకవర్గంలోని నేతలు అనుకుంటున్నారు. ఇప్పుడిదే గన్నవరంలో చర్చించుకుంటున్నారు.