Begin typing your search above and press return to search.

ఇండియాలో ఉండేది గుజరాతీ పాలననా? ఇండియా పాలనా కాదా?

By:  Tupaki Desk   |   18 Feb 2021 6:00 PM IST
ఇండియాలో ఉండేది గుజరాతీ పాలననా? ఇండియా పాలనా కాదా?
X
రెండోసారి అధికారంలోకి వచ్చాక దేశంలో బీజేపీకి పట్టాపగ్గాలు లేకుండా పోయింది. క్లియర్ కట్ మెజార్టీ రావడంతో ఇష్టానుసారంగా బిల్లులు పాస్ చేస్తూ.. అసమ్మతి వాదులపై దేశద్రోహులుగా ముద్రవేస్తూ చెలరేగిపోతున్నారు. ప్రశ్నిస్తే జైల్లో వేస్తున్నారు.

దేశాన్ని పాలించే ఇద్దరు నంబర్ 1, 2 వ్యక్తులు గుజరాతీలే కావడం గమనార్హం. నిజానికి ఇంత పెద్ద దేశాన్ని పాలించే వారిలో సామాజిక సమతుల్యం పాటించాలి. ఉత్తరాది, దక్షిణాది, తూర్పు, పశ్చిమ ప్రాంతాలకు అనుగుణంగా పట్టం కట్టాలి. కానీ ఇద్దరు గురు శిష్యులు మోడీషాలు ఒకే రాష్ట్రం గుజరాత్ నుంచి వచ్చి దేశాన్ని పాలిస్తున్నారు.

వీరిని బీజేపీలో అడిగే వారే లేరు.గుజరాత్ రాష్ట్రాన్ని వీరిద్దరి ద్వయమే పాలించింది. మోడీ సీఎంగా.. అమిత్ షా హోంమంత్రిగా పాలించారు.నాడు కార్పొరేటీకరణకు ద్వారాలు తెరిచి ఉచితాలకు వీరు స్వస్తి పలికారు.

ఇప్పుడు అదే గుజరాతీ పాలనను దేశంపైకి ఈ ఇద్దరు రుద్దారని మేధావులు - నెటిజన్లు సోషల్ మీడియాలో ఆరోపిస్తున్నారు. కరోనా కల్లోలంతో ఆగమాగం అవుతున్న జనాలకు ఊరటనివ్వకపోగా విపరీతంగా రేట్లు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.చూస్తుంటే దేశంలో ఇప్పుడు గుజరాతీ పాలననే నడుస్తోందని.. భారత దేశంలో మిగతా వారికి వాయిస్ లేకుండా పోయిందన్న విమర్శ వ్యక్తమవుతోంది.