Begin typing your search above and press return to search.

కొడాలితో పోరులో దేవినేని ఒంటరి అయ్యారా?

By:  Tupaki Desk   |   22 Jan 2021 2:30 PM GMT
కొడాలితో పోరులో దేవినేని ఒంటరి అయ్యారా?
X
కృష్ణా జిల్లా అంటే టీడీపీకి ఆయువు పట్టు. నాలుగు దశాబ్ధాల చరిత్ర కలిగిన దేవినేని కుటుంబం హవా కృష్ణా జిల్లాలో అప్రతిహతంగా సాగుతోంది. పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా చంద్రబాబు ఈ దేవినేని కుటుంబానికి ఇచ్చే ప్రాధాన్యత అంతా ఇంతాకాదు కాదు.

చంద్రబాబు గత హయాంలో సీఎంగా ఉన్నప్పుడు దేవినేని ఉమా కృష్ణ జిల్లాకు సీఎంగా ఉండేవారన్న ప్రచారం సాగింది. జిల్లా రాజకీయాలపై ఉమకు పట్టు బాగుంది.

అయితే ఇప్పుడు జగన్ సర్కార్ ధాటికి దేవినేని పునాదులు కదిలిపోయాయి. కృష్ణ జిల్లాలో టీడీపీ చిత్తుగా ఓడింది. దేవినేని సైతం ఓడిపోయారు. ఈ ఓటమితో ఆయనచుట్టూ ఉన్న నేతలంతా ఒక్కొక్కరుగా కనుమరుగయ్యారు. విజయవాడలో సైతం ఆయనకు మద్దతు కరువైన పరిస్థితి.

అయితే ఇప్పుడు దేవినేని ఉమకు తన సొంత సామాజికవర్గానికే చెందిన ఏపీ వైసీపీ మంత్రి కొడాలి నానితో ఫైట్ సాగుతోంది. ఈ రాజకీయ యుద్ధంలో ఇప్పుడు దేవినేని ఉమ ఒంటరైనట్టు జిల్లా రాజకీయాల్లో చర్చ జరుగుతోంది.

ఇటీవల కృష్ణా జిల్లాలో కొడాలి నానితో రాజకీయ పోరాటానికి దేవినేని సిద్ధమయ్యారు. వరుసగా నానిని టార్గెట్ చేస్తూ పార్టీ కోసం దేవినేని తీవ్రంగా ప్రయత్నించారు.

అయితే నానితో పోరాటంలో దేవినేనికి కలిసి వచ్చేవారే లేకుండా పోయారు. మంత్రిగా ఉండగా ఆయన వెంట ఉన్న వారు కూడా ఇప్పుడు దేవినేని వెంట రావడం లేదు. కొడాలి నానితో సై అంటే సై అంటూ అరెస్టుల వరకు వెళ్లిన దేవినేనికి పార్టీ నేతల మద్దతు లభించడం లేదని జిల్లాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కలిసిరావాలని పార్టీ నేతలకు దేవినేని ఉమ ఫోన్ చేసినా కూడా మద్దతుగా రావడం లేదని ఆయన బాధపడుతున్నాడట.. పార్టీలోని సీనియర్ నేతలు ఆయనతో కలిసి రావడం లేదని ప్రచారం సాగుతోంది.