Begin typing your search above and press return to search.
కాల్ రికార్డింగ్ యాప్స్ వాడుతున్న వారికి ఇది హెచ్చరిక
By: Tupaki Desk | 11 May 2022 2:23 PM GMTఇన్నాళ్లు మనం ఎవరితో మాట్లాడుతున్నా వారి కాల్స్ రికార్డ్ చేసుకునే వాళ్లం.. వివాదాలైనా.? లేదా మన పనుల కోసమైనా ఆ రికార్డింగ్ లను చేసుకొని భద్రపరుచుకొని అవసరమైన వాటికి ఉపయోగించుకునే వీలుండేది. ఈ రికార్డింగ్ ల వల్ల ఉపయోగాల కంటే అనర్థాలే ఎక్కువగా జరిగేవి. చాలా మంది సంసారాలు, నేతల జాతకాలు, మాటలు బయటపడి పరువు పోయేది.
కాల్ రికార్డింగ్ యాప్స్ కు సంబంధించిన వివాదాలు పెద్దవి కావడంతో గూగుల్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి దాన్ని అమల్లోకి తెచ్చింది. ప్లేస్టోర్ లో ఇన్నాళ్లూ అందుబాటులో ఉన్న కాల్ రికార్డింగ్ యాప్స్ పై నిషేధం విధిస్తున్నట్టు గూగుల్ గత నెలలో తెలిపింది. ఇన్ బిల్ట్ కాల్ రికార్డింగ్ ఫీచర్ ఉన్న ఫోన్లపై గూగుల్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఎలాంటి నష్టం లేదు.
ఫోన్ లో కాల్ రికార్డింగ్ ఆప్షన్ లేని కారణంగా ప్లే స్టోర్ నుంచి కాల్ రికార్డింగ్ యాప్స్ ను డౌన్ లోడ్ చేసుకొని వినియోగించాలని భావిస్తున్న వారికి మాత్రం ఇవాళ నుంచి ఆ అవకాశం ఉండదు. కొన్ని సంవత్సరాల నుంచి కాల్ రికార్డింగ్ యాప్స్ ను గూగుల్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
వినియోగదారుల భద్రతకు ఈ కాల్ రికార్డింగ్స్ కారణంగా భంగం కలుగుతోందనేది గూగుల్ వాదన. అయితే గూగుల్ ఓన్ డైలర్ యాప్ లో ఇప్పటికీ ఇద్దరికి వినిపించేలా కాల్ రికార్డ్ అవుతుందని తెలిపే అలర్ట్ ఉంటుంది. అయితే చాలా ప్రైవేట్ యాప్స్ లో ఇలాంటి ఫీచర్ ఉండకపోవడంతో మనం మాట్లాడేది రికార్డ్ అవుతుందా? లేదా? అన్నది తెలియదు.
ఈ క్రమంలోనే ప్లే స్టోర్ లో కాల్ రికార్డింగ్ యాప్స్ పై గూగుల్ నిషేధం విధించడానికి రెడీ అయ్యింది. ఈ నిషేధం కేవలం థర్డ్ పార్టీ యాప్స్ కు మాత్రమే వర్తిస్తుంది. మీ స్మార్ట్ ఫోన్ లో గూగుల్ డైలర్ లో మాత్రమే కాల్ రికార్డింగ్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. ఇంతకాలం గూగుల్ ప్లే స్టోర్ లో ఉన్న థర్డ్ పార్టీ కాల్ రికార్డింగ్ యాప్స్ ను మాత్రమే తొలగించాలనే నిర్ణయానికి గూగుల్ వచ్చేసింది.
గూగుల్ బ్యాన్ చేసిన మరుసటి రోజే ట్రూకాలర్ కూడా కాల్ రికార్డింగ్ ఫీచర్ ను తొలగిస్తున్నట్టు పేర్కొంది. దీంతో ఇక మీదట కాల్ రికార్డింగ్స్ సదుపాయం అందుబాటులో ఉండకపోవచ్చని అంటున్నారు.