Begin typing your search above and press return to search.
సల్మాన్ ఖాన్ ను చంపేస్తానన్నోడ్ని పట్టేశారు.. వాడెక్కడుంటాడంటే?
By: Tupaki Desk | 11 May 2023 10:11 AM GMTబాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ను చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడిన ఉదంతానికి సంబంధించి చిక్కుముడి వీడింది. సల్మాన్ ను చంపేస్తానంటూ బెదిరింపులకు దిగేటోడి వివరాలు వాడి బ్యాక్ గ్రౌండ్ ను గుర్తించిన పోలీసులు విస్మయానికి గురి అవుతున్నారు. ఎందుకంటే బెదిరింపుల కు పాల్పడింది బ్రిటన్ కు చెందిన పదహారేళ్ల కుర్రాడు. ప్రస్తుతం మెడికల్ కాలేజీలో మెడిసిన్ చదువుతున్నాడు.
గ్యాంగ్ స్టర్ గోల్డీ బ్రార్ పేరుతో సల్మాన్ కు బెదిరింపుల మొయిల్ చేసిన అతడ్ని గుర్తించేందుకు పోలీసుల తీవ్రంగా ప్రయత్నించారు. గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ అనుచరుడు గోల్డీ బ్రార్ తో మాట్లాడుకొని విషయాన్ని సెటిల్ చేసుకోవాలన్నాడు. లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవని సల్మాన్ కు వార్నింగ్ ఇచ్చాడు. దీంతో కండల వీరుడు పోలీసుల్ని ఆశ్రయించారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ కేసులో తొలుత రాజస్థాన్ కు చెందిన ధకడ్ రామ్ బిష్ణోయ్ ను నిందితుడిగా గుర్తించి అరెస్టు చేశారు. అయితే అతడి అరెస్టు తర్వాత కూడా సల్మాన్ కు బెదిరింపులు వచ్చాయి. ఈసారి ముంబయి పోలీసు కంట్రోల్ రూంకు ఫోన్ చేసి మరీ సల్మాన్ ను చంపేస్తానని వార్నింగ్ ఇచ్చారు.
దీంతో పోలీసులు మరింత లోతుగా విచారణ చేపట్టారు. అనంతరం అతను బ్రిటన్ కు చెందిన పదహారేళ్ల కుర్రవాడిగా గుర్తించారు. వైద్య విద్యార్థిగా ఉన్న అతనిపై తాజాగా లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. అతడ్ని ఇండియా కు తీసుకురావాలని పోలీసులు పట్టుదలతో ఉన్నారు.