Begin typing your search above and press return to search.

హెచ్చరిక: మీరు మొబైల్ లో పోర్న్ చూస్తున్నారా?

By:  Tupaki Desk   |   18 Feb 2021 3:30 AM GMT
హెచ్చరిక: మీరు మొబైల్ లో పోర్న్ చూస్తున్నారా?
X
స్మార్ట్ ఫోన్లు చేతికి వచ్చాక అరిచేతిలో ప్రపంచం ఆవిష్కృతమైంది. బిల్లుల నుంచి వ్యక్తిగత పనుల వరకు ఇంట్లో, ఆఫీసులో ఉండి ఫోన్ తో కానిచ్చేస్తున్నాం. సమాచారాన్ని అంతా వాట్సాప్ లో పంపిచేస్తున్నాం. అన్ని అప్డేట్స్ అవసరాలు ఫోన్లోనే.

అయితే ఇదే ఫోన్ లో అశ్లీల వీడియోలు (పోర్న్ వీడియోలు) చూస్తున్న వారికి ఇక డేంజర్ బెల్స్ నే. నెట్ లో పోర్న్ వీడియోలు చూసే వారిపై ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పోలీస్ విభాగం నిఘా పెడుతోంది. ఎవరైనా పోర్న్ వీడియోలను సెర్చ్ చేస్తే ‘యూపీ ఉమెన్ పవర్ లైన్ 1090’కు అలెర్ట్ వెళ్తుంది. ఆ తర్వాత సదురు వ్యక్తికి పోలీస్ విభాగం నుంచి ఓ మెసేజ్ వస్తుంది.

పోర్న్ వీడియోలు చూడటం వల్ల వచ్చే ఇబ్బందులపై అందులో అవగాహన కల్పిస్తారు. ఇప్పటికే 6 జిల్లాల్లో విజయవంతం అయిన ఈ ప్రాజెక్ట్ ను ఇక రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని పోలీసులు చెబుతున్నారు.ఇక యూపీలో హిట్ అయితే దీన్ని దేశవ్యాప్తంగానూ అమలు చేసేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ సమాయత్తమవుతోంది. అదే జరిగితే పోర్న్ రాయుళ్ల ఆటకట్టడం ఖాయంగా కనిపిస్తోంది.