Begin typing your search above and press return to search.
సూర్యుడి ప్రతాపానికి కూడా మహమ్మారి తగ్గలేదు
By: Tupaki Desk | 19 May 2020 3:31 PM GMTమహమ్మారి వైరస్ జిడ్డుగా అంటుకుంది. ఆ వైరస్ ఎంతకీ వదలడం లేదు. సూర్యుడిని కూడా తట్టుకుని ఆ వైరస్ నిలబడుతోంది. దానికి ఉదాహరణ ఈ వేసవికాలం. వాస్తవంగా వేసవికాలం ఉష్ణోగ్రతలు భారీగా ఉంటాయి. ఏడాది కాలంలో గరిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. కొన్నిసార్లు దాదాపు 45 డిగ్రీలకు కూడా నమోదయ్యేది. భారతదేశంలో ఆ వైరస్ మొదలైందే వేసవి ప్రారంభం సమయంలోనే. మార్చి నెలలో ఆ వైరస్ విజృంభించి ఇప్పుడు కూడా తీవ్రంగా వ్యాపిస్తోంది. ఇదే విషయాన్ని ఓ విశ్వవిద్యాలయం అధ్యయనం చేసింది. ఉత్తరార్ధగోళంలోని అధిక వేసవి ఉష్ణోగ్రతలు ఉన్నా కరోనా వైరస్ వ్యాప్తిని గణనీయంగా పరిమితం చేయలేదని.. అలాంటి అవకాశం లేదని ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయం అధ్యయనం తెలిపింది. ఈ మేరకు సైన్స్ జర్నల్‌లో ఓ నివేదికను విడుదల చేసింది.
వాతావరణం వలన కరోనా వైరస్ మధ్య సంబంధం లేదని తేలింది. ఎక్కువ వేడిగా ఉన్న ప్రాంతంలో వైరస్ వ్యాప్తి చెందడానికి తక్కువ అవకాశం ఉందని చాలాసార్లు, చాలామంది చెప్పారు. అయితే అవన్నీ అవాస్తవమని గుర్తించారు. వాతావరణం, వైరస్ వ్యాప్తి మధ్య ఉన్న పరస్పర సంబంధాన్ని పూర్తిగా తోసిపుచ్చకుండలేదు. కానీ వైరస్ వ్యాప్తిపై వాతావరణం ప్రభావం చాలా తక్కువగా ఉందని ఆ విశ్వవిద్యాలయం ప్రతినిధులు తెలిపారు. వాతావరణ పరిస్థితుల మీద నమ్మకం పెట్టుకోవద్దని సూచిరించింది. వైరస్ వ్యాప్తికి ఎక్కువ తేమ, పొడి వాతావరణం అనేది చాలా తక్కువగా ఉంటుందని అధ్యయనంలో తెలిపింది.
ఫ్లూ జాతికి చెందిన వైరస్ వ్యాప్తిలో తేమ ప్రధాన పాత్ర పోషిస్తుందని అందరికీ తెలిసిందే. కానీ కోవిడ్ వ్యాప్తిపై పరిమాణం వ్యాప్తిపై వాతావరణం చాలా తక్కువ ప్రభావం చూపిస్తుందని ఆ అధ్యయనంలో వివరించింది. వాతావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా.. అధిక జనాభా కారణంగానే వైరస్ త్వరగా వ్యాపిస్తుందని నివేదికలో పరిశోధకులు తెలిపారు. వాతావరణంపై ఆధారపడకుండా బలమైన నియంత్రణ చర్యలు తీసుకోవాలని సూచించారు.