Begin typing your search above and press return to search.

మెక్సికో ఎయిర్ పోర్ట్ లో మనోడికి అవమానం

By:  Tupaki Desk   |   9 Feb 2016 7:20 AM GMT
మెక్సికో ఎయిర్ పోర్ట్ లో మనోడికి అవమానం
X
ప్రాశ్చాత్య దేశాల్లో తరచూ జాత్యాంహకార ఘటనలు చోటు చేసుకోవటం మామూలుగా మారింది. తాజాగా మెక్సికోలో చోటు చేసుకున్న ఈ ఘటనలో సిక్కు జాతీయుడు.. ఇండో-అమెరికన్ నటుడు.. డిజైనర్ అయిన వారిస్ అహ్లువాలియాకు చేదు అనుభవం ఎదురైంది. మెక్సికో నుంచి న్యూయార్క్ వెళ్లాల్సిన అతగాడు.. ఎయిర్ పోర్ట్ కి వచ్చారు. అక్కడి భద్రతా సిబ్బంది వారిస్ తలపాగాను తీయాల్సిందిగా కోరారు. అది తమ మతసంప్రదాయం అని.. దాన్ని తొలగించటం సాధ్యం కాదని చెప్పారు.

దీంతో ఆగ్రహించిన అక్కడి అధికారులు.. వారిస్ ను విమానం నుంచి దించేశారు. ఈ విషయాన్ని అతగాడు తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో వెల్లడించాడు. న్యూయార్క్ ఫ్యాషన్ షోకు తాను వెళ్లాల్సి ఉందని.. తనను ఇబ్బంది పెట్టొద్దని కోరుకున్నా అతని మాటను వినని మెక్సికో ఎయిర్ పోర్ట్ సిబ్బంది జాత్యహంకార చర్యకు పాల్పడ్డారు. ఈ ఇష్యూ పెద్దది కావటంతో.. వారిస్ కు జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లుపేర్కొన్న ఎయిర్ లైన్స్ అధికారులు.. ప్రయాణికులు మత విశ్వాసాల్ని పక్కన పెట్టి రూల్స్ పాటించాలని వ్యాఖ్యానించటం గమనార్హం.