Begin typing your search above and press return to search.

35 ఏళ్ల నేత ఆరేళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు

By:  Tupaki Desk   |   28 Jun 2015 9:44 AM IST
35 ఏళ్ల నేత ఆరేళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు
X
ప్రజాప్రతినిధిగా ఉంటూ పలువురికి ఆదర్శంగా ఉండాల్సిన ఒక రాజస్థాన్‌ రాష్ట్రానికి చెందిన ఒక నేత చేసిన నిర్వాకం ఇప్పుడు వివాదాస్పదంగా మారటమే కాదు.. పెద్ద చర్చకు తెర తీసింది. రాజస్థాన్‌కు చెందిన గాంగ్రార్‌ పంచాయితీ పరిధిలోని పంచాయితీ ప్రతినిధి రతన్‌ జాట్‌ అనే 35ఏళ్ల వ్యక్తి.. ఆరేళ్ల వయసున్న పసిపాపను పెళ్లాడాడు.

వాస్తవానికి ఈ ఘోరకలి జరిగి వారం జరుగుతున్నా ఇప్పటివరకూ బయటకు రాలేదు. ఈ పెళ్లి సందర్భంగా పెళ్లికూతురి తల్లిదండ్రులు దగ్గరుండి వివాహాన్ని జరిపించారు. ఈ దారుణం.. వాట్స్‌ప్‌ ద్వారా ఫోటోలు బయటకు రావటంతో బయట ప్రపంచానికి పొక్కింది.

దీనిపై పెద్దఎత్తున విమర్శలు రావటంతో పోలీసులు నిద్ర లేచారు. వెంటనే.. సంబంధిత నేతపై కేసు నమోదు చేశారు. మరోవైపు.. ఈ పెళ్లిని రద్దు చేసేందుకు జిల్లా కలెక్టర్‌ స్థానిక కోర్టులో కేసు దాఖలు చేశారు. ఇంతజరిగినా సదరు నేతను మాత్రం పోలీసులు ఇంకా అదుపులోకి తీసుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.