Begin typing your search above and press return to search.

వాడు జైలుకొచ్చినంత‌నే ఏసేద్దామ‌ని ఖైదీలు డిసైడ్‌!

By:  Tupaki Desk   |   22 Jun 2019 1:30 AM GMT
వాడు జైలుకొచ్చినంత‌నే ఏసేద్దామ‌ని ఖైదీలు డిసైడ్‌!
X
జైలు అన్నంత‌నే క‌రుడుగ‌ట్టిన నేర‌స్తుల స‌మూహంగా చెప్పాలి. మ‌రి.. అలాంటి జైల్లో ఉన్న ఖైదీలంతా ఒక‌డి కోసం మ‌స్తు వెయిట్ చేస్తున్నార‌ట‌. వాడు జైలుకొచ్చినంత‌నే ఏసేయాల‌ని పంతం పెట్టుకొని మ‌రీ ఉన్నార‌ట‌. అది కూడా ఏ ఒక్క‌ళ్లో.. ఇద్ద‌రో కాదు.. జైల్లోని ఖైదీలు మొత్తం అదే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట‌. సంచ‌ల‌నంగా మారిన ఈ ఉదంతం ఎక్క‌డ చోటు చేసుకుంది? ఖైదీలంతా ఎంతో పంతంగా ఎదురుచూస్తున్న వాడెవ‌డు? ఎందుకంటే క‌సిగా ఉన్నార‌న్న విష‌యాల్లోకి వెళితే..

మూడు నాలుగు రోజుల క్రితం వ‌రంగ‌ల్ జిల్లాలో ఆరుబ‌య‌ట నిద్ర‌పోతున్న త‌ల్లి ఒడిలోంచి దొంగ‌త‌నంగా తీసుకుపోయిన తొమ్మిది నెల‌ల శిశువును అనాగ‌రికంగా.. నోటితో చెప్ప‌లేని రీతిలో త‌న ప‌శుత్వాన్ని ప్ర‌ద‌ర్శించిన కామాంధుడు ప్ర‌వీణ్ ఉదంతం తెలిసిందే. స‌భ్య స‌మాజం మొత్తం ఛీద‌రించుకోవ‌ట‌మేకాదు.. అలాంటి దుర్మార్గుడ్ని బ‌హిరంగంగా ఉరి తీయాలంటూ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు జ‌రుగుతున్నాయి.

ఈ ఆరాచ‌కం గురించి వ‌రంగ‌ల్ సెంట్ర‌ల్ జైల్లోని ఖైదీల‌కు ప్ర‌వీణ్ ఉదంతం తెలిసింది. ఇంత దారుణ‌మైన నేరానికి పాల్ప‌డిన ఆ మాన‌వ మృగం ఎట్టి ప‌రిస్థితుల్లో త‌మ జైలుకే వ‌స్తాడ‌ని.. అత‌డు వ‌చ్చినంత‌నే ఏమైతే అదైంది.. వాడ్ని మాత్రం బ‌త‌క‌నివ్వ‌కూడ‌దు.. తొమ్మిది నెల‌ల ప‌సిగుడ్డును అంత దారుణానికి పాల్ప‌డిన ప్ర‌వీణ్ ను చంపేయాల‌ని డిసైడ్ అయ్యార‌ట‌.

ఆ క‌సాయి కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నార‌ట‌. అయితే.. ఖైదీల ఆలోచ‌న గురించి తెలిసిన జైలు అధికారులు ఒక్క‌సారిగా అలెర్ట్ అయ్యారు. అత‌న్ని జైలుకు తెస్తే.. ఖైదీలంతా క‌లిసి చంపేస్తార‌న్న విష‌యాన్ని గుర్తించిన అధికారులు.. అత‌డి రాక ఆల‌స్య‌మ‌వుతుంద‌న్న విష‌యాన్ని చెప్పి.. గుట్టుచ‌ప్పుడు కాకుండా రాత్రివేళ‌లో ప్ర‌త్యేక సెల్లో వేసేశారు. అత‌న్ని హై సెక్యురిటీ బ్యార‌క్ లో ఉంచిన‌ట్లుగా తెలుస్తోంది. త‌మ చేతిలో త‌ప్పించుకునేలా అధికారులు ప్లాన్ చేసిన‌ప్ప‌టికీ.. ప్ర‌వీణ్ దొరికితే చాలు.. తామే అత‌న్ని చంపేయాల‌న్న పంతంతో ప‌లువురు నేర‌స్తులు ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. ప్ర‌వీణ్ పై జైల్లో ఎలాంటి దాడికి గురి కాకుండా కాపాడ‌టం జైలు అధికారుల‌కు ఇప్పుడో పెద్ద త‌ల‌నొప్పిగా మారిన‌ట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ప్ర‌వీణ్ త‌ర‌ఫున అత‌డి కేసును ఎవ‌రూ వాదించ‌కూడ‌ద‌ని వ‌రంగ‌ల్ బార్ అసోసియేష‌న్ నిర్ణ‌యించింది. ఇలాంటి క‌సాయికి మ‌ర‌ణ‌శిక్ష త‌ప్ప‌నిస‌రిగా ప‌డాల‌ని ప‌లువురు లాయ‌ర్లు త‌మ అభిప్రాయాన్ని చెబుతున్నారు.