Begin typing your search above and press return to search.
వరంగల్ ఉప ఎన్నిక : అభ్యర్థి ఖరారు
By: Tupaki Desk | 29 Sep 2015 2:09 PM GMTత్వరలో ఉప ఎన్నిక జరుగనున్న వరంగల్ లోక్ సభ స్థానానికి రాజకీయ పార్టీలు రెడీ అవుతున్నాయి. అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే కసరత్తు చేస్తున్న పార్టీలు తుది నిర్ణయం వెలువరించనప్పటికీ...ఈ విషయంలో లెఫ్ట్ పార్టీలు ముందున్నాయి. వరంగల్ లోక్ సభ స్థానం నుంచి తమ తరపున పోటీ చేయనున్న అభ్యర్థిని వామపక్ష పార్టీలు ప్రకటించాయి. వరంగల్ లో సమావేశం ఏర్పాటుచేసుకున్న వామపక్షాల అగ్రనేతలు సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి - సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం - ఇతర లెఫ్ట్ పార్టీల నాయకులు తమ అభ్యర్థిగా బషీర్ బాగ్ లా కాలేజీలో ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న ప్రొ. వినోద్ కుమార్ పేరును ప్రతిపాదించాయి.
టీఆర్ ఎస్ పాలనలో అవినీతి పెరిగిందని ఈ సందర్భంగా చాడా వెంకట రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం పౌరహక్కులను హరించివేస్తోందని, పౌరహక్కులను వామపక్షాలే కాపాడాలన్నారు. సహజ వనరులను ప్రభుత్వం కొల్లగొడుతుందని, టీఆర్ ఎస్ ప్రభుత్వం విద్యార్థి - శ్రామిక వ్యతిరేక నిర్ణయాలను తీసుకుంటుందన్నారు. సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా కేసీఆర్ పాలన సాగుతోందని విమర్శించారు. తెలంగాణ సామాజిక న్యాయం లేదని - అణిచివేతనే ఉందన్నారు. బీసీ సబ్ ప్లాన్ కు తాము పూర్తిగా మద్ధతు ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అందర్ని సంప్రదించాకే వినోద్ ను వరంగల్ బరిలోకి దించామని తెలిపారు. సమాజంలో మార్పు కోసమే రాజకీయాల్లోకి వస్తున్నట్లు వరంగల్ వామపక్షాల ఉమ్మడి అభ్యర్థి గాలి వినోద్ కుమార్ తెలిపారు.
రాజకీయాల్లోకి రావాలని తన కాలేజీ విద్యార్థులు రూ.లక్ష విరాళం ఇచ్చారని ఆయన తెలిపారు. తెలంగాణలో దొరల పాలన సాగుతోందని, ప్రస్తుతం తెలంగాణలో ఎవరికీ స్వేచ్చ లేదని ఆయన విమర్శించారు. హింసకు పాల్పడుతున్న సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ ఎలా సాధిస్తాడని ఆయన ప్రశ్నించారు. డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత కడియం శ్రీహరి వరంగల్ లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.