Begin typing your search above and press return to search.

వరంగల్ మానసను చంపేసింది స్నేహితుడే?

By:  Tupaki Desk   |   29 Nov 2019 4:45 AM GMT
వరంగల్ మానసను చంపేసింది స్నేహితుడే?
X
నమ్మటానికి మించిన పెద్ద తప్పు మరొకటి ఉండటం లేదు. ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న నేరాల్ని చూస్తే ఈ విషయం ఇట్టే అర్థం కాక మానదు. సంచలనంగా మారిన వరంగల్ మానస హత్య కేసుకు సంబంధించి కీలక సాక్ష్యాలు లభ్యం కావటమే కాదు.. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నాడు. పోలీసుల విచారణలో అన్ని విషయాల్ని బయటకు వెళ్లగక్కేశాడు.

హత్య జరిగిన 24 గంటల్లోనే వరంగల్ పోలీసులు కేసును ఛేదించారు. హన్మకొండకు చెందిన మానసకు స్టేషన్ ఘన్ పూర్ మండలం నమిలిగొండకు చెందిన సాయిగౌడ్ తో పరిచయముంది. వారిద్దరూ తరచూ ఫోన్లో మాట్లాడుకునేవారు. బుధవారం పుట్టిన రోజు కావటంతో ఆమె ఇంట్లో వారికి గుడికి వెళ్లి వస్తానని బయటకు వెళ్లింది. మధ్యాహ్నం రెండు గంటల వేళలో ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆమెను.. కాజీపేటకు రావాలని సాయి కోరాడు. అతను చెప్పిన ప్లేస్ కు మానస వెళ్లింది. అప్పటికే అక్కడ కారుతో ఉన్న సాయి.. ఆమెను ఎక్కించుకొని పెద్ద పెండ్యాల సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు.

అక్కడ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే.. ఊహించని ఈ షాక్ తో ఆమె మరణించినట్లు నిందితుడు చెబుతున్నాడు. దీంతో ఆందోళనకు గురైన సాయి ఆమెను ఎక్కించుకొని కారులోనే ఆరుగంటల పాటు నగర శివారులో తిరిగాడు. తన స్నేహితులకు ఫోన్ చేసి సాయం కోరితే వారు నో చెప్పేశారు. మానస మర్మాంగం నుంచి తీవ్ర రక్తస్రావం కావటంతో ఆమె దుస్తుల్ని తొలగించి.. కొత్త పంజాబీ డ్రెస్ కొని దాన్ని వేశాడు. అనంతరం రాత్రి వేళలో నిర్మానుష్య ప్రాంతంలో డెడ్ బాడీని పడేసి వెళ్లిపోయాడు.

మానస ఫోన్ స్విచాఫ్ లో ఉండటంతో ఆందోళన చెందిన ఆమె తల్లిదండ్రులు పలుచోట్ల వెతికి చివరకు పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఆమె ఫోన్ కాల్ డేటా ఆధారంగా మానస బాయ్ ఫ్రెండ్ సాయిని అదుపులోకి తీసుకొని విచారించటంతో అసలు విషయాల్ని బయటకు వచ్చాయి. స్నేహితుడి మనసులోని అసలు ఉద్దేశాన్ని గుర్తించక మానస తన జీవితాన్నే మూల్యంగా చెల్లించుకోవాల్సి వచ్చింది.