వరంగల్ ఎంపీ స్థానానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో కడియం శ్రీహరి ఎంపీ పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో వరంగల్ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. తాజాగా ఎన్నికల కమీషన్ వరంగల్ ఎంపీ స్థానానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. తక్షణమే ఎన్నిక కోడ్ అమల్లోకి వస్తుందని ప్రకటించారు.
వరంగల్ ఉప ఎన్నిక షెడ్యూల్ చూస్తే..
= అక్టోబర్ 28న నోటిఫికేషన్ జారీ
= నవంబరు 4న నామినేషన్ల దాఖలు
= నవంబరు 5న నామినేషన్ల స్వీకరణ
= నవంబరు 7న నావినేషన్ల ఉపసంహరణ
= నవంబరు 21న ఉప ఎన్నిక పోలింగ్
= నవంబరు 24న ఓట్ల లెక్కింపు