Begin typing your search above and press return to search.
వరంగల్ ఉప ఎన్నిక హడావుడి మొదలైనట్లే
By: Tupaki Desk | 12 Jun 2015 4:20 AM GMTఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి.. తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. దీంతో.. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్ ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యం కానుంది.
కడియం రాజీనామాను ఆమోదించిన నాటి నుంచి ఆర్నెల్ల లోపుల ఉప ఎన్నికను నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఈ ఉప ఎన్నికకు సంబంధించిన రాజకీయ హడావుడి మొదలైనట్లే. అధికారపార్టీకి చెందిన నేత రాజీనామాతో.. సహజంగా అధికారపార్టీకి ఉండే అవకాశం నేపథ్యంలో వరంగల్ ఎంపీ స్థానానికి పార్టీ అభ్యర్థిగా మారాలని పలువురు ఆశిస్తున్నారు.
తమకే సీటు దక్కాలని ఇప్పటికే ప్రయత్నాలు షురూ చేశారు. వివిధ జేఏసీలకు చెందిన నేతలతో పాటు.. పార్టీకి చెందిన నేతలు వరంగల్ సీటుకు టీఆర్‌ఎస్ అభ్యర్థి కావాలని కోరుకుంటున్నారు. అభ్యర్థి టిక్కెట్టు వ్యవహారంలో కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు.. వరంగల్ ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. తమ సత్తా చాటాలని అనుకుంటోంది.
ఈ నేపథ్యంలో.. తమ పార్టీ తరఫున బలమైన అభ్యర్థిని బరిలోకి దించాలని వ్యూహరచన చేస్తోంది వరంగల్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసేందుకు పలువురు సీనియర్ నేతలు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. కేంద్రమాజీ మంత్రి సర్వే సత్యనారాయణ.. మాజీ ఎంపీలు రాజయ్య.. వివేక్‌లు పార్టీ టిక్కెట్టు ఆశిస్తున్నారు. 2014లో జరిగిన ఎన్నికల్లో వరంగల్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన రాజయ్య.. కడియం శ్రీహరి చేతిలో ఓడిపోయారు. మొత్తంగా వరంగల్ ఉప ఎన్నికకు సంబంధించి హడావుడి తాజాగా షురూ అయ్యిందని చెప్పక తప్పదు.