Begin typing your search above and press return to search.

తాలిబ‌న్ల తీరుపై సోష‌ల్ మీడియాలో వార్ మొదలు

By:  Tupaki Desk   |   14 Sep 2021 1:30 PM GMT
తాలిబ‌న్ల తీరుపై సోష‌ల్ మీడియాలో వార్ మొదలు
X
తాలిబాన్లు యూనివ‌ర్సిటిల్లో మహిళా విద్యార్థులకు డ్రెస్ కోడ్‌ను తప్పనిసరి చేయడానికి నిర‌స‌న‌గా అఫ్గానిస్తాన్ మహిళలు ఆన్‌లైన్ ఉద్యమాన్ని ప్రారంభించారు. డు నాట్ టచ్ మై క్లోత్స్', 'అఫ్గానిస్తాన్ కల్చర్' హ్యాష్‌ట్యాగ్‌లతో అందమైన, రంగురంగుల సంప్రదాయ డ్రెస్‌ల‌ను ధరించిన తమ ఫోటోలను ఆన్‌లైన్‌లో షేర్ చేస్తున్నారు.

సోష‌ల్ మీడియాలో మాధ్యమాల్లో ఈ ఉద్యమాన్ని ప్రారంభించిన డాక్టర్ బహర్ జలాలీతో బీబీసీ ప్రతినిధి సోడాబా హైదరి మాట్లాడారు. ''అఫ్గానిస్తాన్ ట్రెడిషనల్ క్లోత్స్'' అని గూగుల్‌లో సెర్చే చేయగానే కనిపించే విభిన్న రంగులతో కూడిన అందమైన వ‌స్ర్తాల‌ను చూసి మీరు ఆశ్చర్యపోతారు. భారీ డిజైన్లు, ఎంబ్రాయిడరీ, జాగ్రత్తగా అమర్చిన చిన్నచిన్న అద్దాలతో ప్రతి వ‌స్ర్తం ప్రత్యేకంగా ఉంటుంది. అఫ్గానిస్తాన్ జాతీయ నృత్యం 'అట్టాన్' చేసేటప్పుడు కుచ్చులతో కూడిన పొడవైన స్కర్ట్‌లు మరింత బ్యూటిఫూల్‌గా కనిపిస్తాయి.

అక్కడ కొంతమంది మహిళలు హెవీ ఎంబ్రాయిడరీ టోపీలను, మరికొందరు అందమైన డిజైన్లతో కూడిన కిరీటం లాంటి అలంకరణలను తలపై ధరిస్తారు. అఫ్గానిస్తాన్‌లోని ఒక్కో ప్రాంతానికి చెందిన మహిళలకు ఒక్కో రకమైన అలంకరణ ఆచారాలు ఉంటాయి. 20 సంవ‌త్స‌రాల‌లో అఫ్గానిస్తాన్ మహిళలు యూనివర్సిటీలకు, ఆఫీస్‌ల‌కు వెళ్లేటప్పుడు సంప్రదాయ వస్త్రాల్లాగే కనిపించేవి, కాస్త పొట్టిగా ఉండే బ‌ట్ట‌ల‌ను కూడా వేసుకున్నారు. ఎప్పుడూ ట్రౌజర్లే కాకుండా కొన్నిసార్లు జీన్స్ ధరించేవారు.

భుజాలపై వేసుకునే స్కార్ఫ్‌లను స్టైలిష్‌గా తలకు చుట్టుకునేవారు. కాబుల్‌లోని ఓ విశ్వ‌విద్యాల‌యంలో ప్రొ తాలిబాన్ ర్యాలీ సందర్భంగా విద్యార్థినులు బుర్ఖా ధరించారు. కానీ వీకెండ్‌లో 'తాలిబాన్ ఆర్డర్'కు మద్దతుగా కాబుల్‌లో జరిగిన తాలిబాన్ అనుకూల ర్యాలీలో మహిళలంతా పొడవైన నల్లటి బుర్ఖాలు ధరించారు. వారి ముఖాలు, చేతులు బయటకు కనిపించకుండా ఉన్న డ్రెసింగ్ స్ట‌యిల్‌, గత 20 సంవ‌త్స‌రాల నాటికి మహిళల వస్త్రధారణకు పూర్తిగా విరుద్ధంగా అనిపించింది.

మేకప్ వేసుకునేవారు, మోడ్ర‌న్‌ దుస్తులు ధరించే వారు 'ముస్లిం అఫ్గాన్ మహిళలకు ప్రాతినిధ్యం వహించవద్దు', 'షరియా చట్టం అనుమతించని విదేశీ మహిళల హక్కులు మాకు అక్కర్లేదు' అని కాబుల్‌లో జరిగిన తాలిబాన్ అనుకూల ర్యాలీలో మహిళలు నినదించడం ఒక వీడియోలో కనిపించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అఫ్గానిస్తాన్ ఆడ‌వారు వెంటనే దీనిపై స్పందించారు. అఫ్గానిస్తాన్‌లోని అమెరికన్ విశ్వ‌విద్యాల‌యంలోని మాజీ హిస్టరీ ప్రొఫెసర్, డాక్టర్ బహర్ జలాలీ ప్రారంభించిన సామాజిక ఉద్యమంలో భాగమైన మహిళలంతా గతంలోలాగే తాము సంప్రదాయ దుస్తులు వేసుకునేందుకు ప‌ర్మిష‌న్ ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు.

దీని కోసం 'డు నాట్ టచ్ మై క్లోత్స్', 'అఫ్గానిస్తాన్ కల్చర్' హ్యాష్ ట్యాగ్‌లను ఉపయోగించారు. నేను ఆందోళన చెందుతున్న అంశాల్లో అతి ముఖ్యమైనదేంటంటే... అఫ్గానిస్తాన్ గుర్తింపు, సార్వభౌమత్వం ప్రమాదంలో పడుతున్నాయి. అందుకే ఈ సామాజిక ప్రచారాన్ని ప్రారంభించాను'' అని జలాలీ చెప్పారు. గ్రీన్ రంగుల్లోని అఫ్గానిస్తాన్ సంప్రదాయ దుస్తుల్నిధరించిన ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఆమె.. '' అఫ్గానిస్తాన్ అసలైన సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా'' ఫొటోలు పంచుకోవాలని ఇతరులను కోరింది. మీరు మీడియాలో చూస్తున్న డ్రెస్‌ను అఫ్గాన్ సంస్కృతి కాదు అని ప్రపంచానికి తెలియజేయాలి అనుకుంటున్నాన్నారు.