Begin typing your search above and press return to search.

మ‌హిళ‌ను అడ్డం పెట్టుకొని..మాట‌లో అంత అర్థ‌ముందా?

By:  Tupaki Desk   |   10 Jan 2019 5:36 AM GMT
మ‌హిళ‌ను అడ్డం పెట్టుకొని..మాట‌లో అంత అర్థ‌ముందా?
X
మోడీ అంటే మాట‌లా? 56 అంగుళాల విశాలమైన ఛాతీ ఉన్నోడు. దేశ‌భ‌క్తికి నిలువెత్తు ప్ర‌తీక‌. నూట పాతిక కోట్ల మంది భార‌తీయులు ఉన్నా.. దేశాన్ని మోడీ ప్రేమించినంతగా ఎవ‌రూ ప్రేమించ‌లేరు. అలాంటి పెద్దాయ‌న్ను ప‌ట్టుకొని కుర్ర‌కుంక‌.. ఆ మాట‌కు వ‌స్తే ప‌ప్పు అని ఎట‌కారం చేసుకునే రాహుల్ నిప్పులు చెర‌గ‌టం క‌మ‌ల‌నాథుల‌కు.. మోడీ ఫ్యాన్స్ కు న‌చ్చుతుందా?

అరే.. ఒక్క ప్ర‌శ్న‌. దానికి సూటిగా స‌మాధానం చెప్పండ్రా బాబు అంటూ నెల‌ల త‌ర‌బ‌డి మొత్తుకుంటున్నా.. లైట్ అంటే లైట్ అన్న‌ట్లుగా లెక్క లేన‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌ట‌మే కాదు.. ఉల్టాగా ఎట‌కారం చేసుకుంటే ఎవ‌రికి మాత్రం కాల‌దు. అందుకే.. ఈ మ‌ధ్య‌న రాహుల్ త‌న మాట తీరులో మార్పు చేశారు. మ‌సాలా ద‌ట్టిస్తున్నారు. పంచ్ ప‌డేలా వ్యాఖ్య‌లు చేస్తున్నారు.

తాజాగా జైపూర్ లో జ‌రిగిన ఒక స‌భ‌లో మాట్లాడుతూ ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు ర‌చ్చ ర‌చ్చగా మారాయి. ఇంత‌కీ ఆయ‌న ఏమ‌న్నారంటే.. విశాల‌మైన 56 అంగుళాల ఛాతీ ఉంద‌ని చెప్పుకున్న మ‌న చౌకీదారు.. త‌న‌ను కాపాడే బాధ్య‌త‌ను ఒక మ‌హిళ‌కు వ‌దిలేశారు. నిర్మ‌లా సీతారామ‌న్ జీ.. న‌న్ను నేను ర‌క్షించుకోలేని స్థితిలో ఉన్నాను.. మీరే న‌న్ను కాపాడాలంటూ ఆమెను ముందుకు నెట్టి.. చ‌ర్చ నుంచి పారిపోయారంటూ ఫైర్ అయ్యారు.

రాహుల్ చేసిన ఈ వ్యాఖ్య వివాదాస్పందంగా మారింది. నిజానికి ఏ మాట ఎందుకు వివాదాస్ప‌దం అవుతుందో ఒక ప‌ట్టాన అర్థం కాదు. నిజానికి రాహుల్ మాట‌నే చూస్తే.. అందులో మ‌హిళ‌ను చిన్న‌బుచ్చ‌టం కంటే.. మ‌హిళకున్న శ‌క్తిని చెప్ప‌క‌నే చెప్పిన‌ట్లు అవుతుంది క‌దా? మోడీ లాంటోడు రియాక్ట్ కాని అంశం మీద నిర్మ‌లా డీల్ చేయ‌టం.. మోడీకి ర‌క్ష‌ణ‌గా ఆమె నిల‌వ‌టం అంటే.. మ‌హిళకున్న స‌మ‌ర్థ ఏపాటిద‌న్న విష‌యం అర్థ‌మ‌వుతుంది క‌దా? కానీ.. ఆ యాంగిల్ లో కాకుండా మ‌హిళ‌ల్ని చిన్న‌బుచ్చేలా రాహుల్ మాట్లాడిన‌ట్లుగా మీడియాలో ప్ర‌సార‌మ‌వుతున్న వార్త‌ల్లో వివాదాస్ప‌ద వ్యాఖ్య అనే మాట‌ను చేర్చ‌టంతో ఇప్ప‌డ‌ది వివాదాస్ప‌దంగా మారే ప‌రిస్థితి.

మోడీ లాంటి నేత త‌న‌పై ఎలాంటి ఒత్తిడిని తెస్తార‌న్న విష‌యం మీద రాహుల్ కు క్లారిటీ ఉన్న‌ట్లుగా క‌నిపిస్తోంది. ఎందుకంటే.. మ‌హిళ‌ల్ని చిన్న‌బుచ్చేలా తాను మ‌ట్లాడిన‌ట్లుగా వ‌స్తున్న వాద‌న‌ను తిప్పి కొట్ట‌ట‌మే కాదు.. మ‌రింత తీవ్రంగా విమ‌ర్శ‌లు చేయ‌టం షురూ చేశారు.

రెండున్న‌ర గంట‌ల పాటు నిర్మ‌ల ప్ర‌ధానిని స‌మ‌ర్థించారు. కానీ.. తాను అడిగిన ఒకే ఒక్క ప్ర‌శ్న‌కు అవును లేదా కాదు అన్న స‌మాధానం ఇవ్వాల‌ని కోరిన‌ప్పుడు మాత్రం బ‌దులు ఇవ్వ‌లేద‌న్నారు. దీనికి మోడీ రియాక్ట్ అవుతూ.. రాహుల్ మ‌హిళ‌ల్ని అవ‌మానించిన‌ట్లుగా ఆరోపించారు. ఒక మ‌హిళ‌కు వ‌దిలి.. మాట‌లో త‌ప్పు ఉంద‌ని మోడీ మండిప‌డుతున్నారు.

తాను చేసిన వ్యాఖ్య‌కు క‌ట్టుబ‌డి ఉన్న రాహుల్ మాత్రం.. ఈ ఎపిసోడ్ మీద మ‌రింత దూకుడుగా రియాక్ట్ అవుతూ.. మ‌హిళ‌ను గౌర‌వించ‌డం ఇంటి నుంచే మొద‌ల‌వుతుంది మోడీజీ అంటూ ట్వీట్ చేశారు. వ‌ణికిపోకండి.. ఒక మ‌నిషిగా నేను అడిగే దానికి బ‌దులు ఇవ్వండంటూ మ‌ళ్లీ త‌న‌కు స‌మాధానం ఇవ్వాల‌న్న మాట‌ను తెర మీద‌కు తెచ్చారు. అరే.. రాహుల్ జీ.. మీ నోటి నుంచి మాట రాకుండా చేసేందుకు ఎన్నిప్ర‌య‌త్నాలు చేసినా.. ఆ ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇవ్వాల్సిందేనంటూ అదే పాట పాడితే ఎలా ?