Begin typing your search above and press return to search.

ఒలింపిక్ విన్నర్ యోగేశ్వర్ పై అల్కా దారుణ వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   8 April 2020 2:30 AM GMT
ఒలింపిక్ విన్నర్ యోగేశ్వర్ పై అల్కా దారుణ వ్యాఖ్యలు
X
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటారు ఢిల్లీకి చెందిన మాజీ ఆమ్ ఆద్మీ పార్టీ నేత.. ఇటీవల కాంగ్రెస్ లో చేరిన అల్కా లంబా. తన మాటలతో తరచూ ఆమె హాట్ టాపిక్ గా మారుతుంటారు. విషయం ఏదైనా సరే సూటిగా.. సుత్తి లేకుండా చెప్పేస్తానని చెప్పే ఆమె.. తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా లో ఇప్పుడు భారీగా చర్చలు సాగుతున్నాయి. ఇంతకీ ఈ వివాదం అసలు ఎలా మొదలైంది? అన్నది చూస్తే..

కరోనా వేళ కూడా రాజకీయాన్ని వదలని నేతల్లో అల్కా లంబా ఒకరు. తాజాగా ఆమె ఆర్ఎస్ఎస్ ను ఉద్దేశించి చేసిన ట్వీట్ తో రచ్చ మొదలైంది. రాజకీయాలతో సంఘ్ కు ఎలాంటి సంబంధమే లేదన్న ఆమె.. బీజేపీ నేతలంతా ఆర్ఎస్ఎస్ అక్రమార్కులేనని ట్వీట్ చేశారు. ఆమెచేసిన ట్వీట్ లో 1970లలో సంఘ్ కార్యకర్తగా ఉన్న మోడీ ఫోటోను జత చేసి వ్యాఖ్యలు చేశారు.

దీనిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటివారిలో ఒలింపిక్ విజేత యోగేశ్వర్ దత్ ఒకరు. నువ్వేంటో నీ మసన్తత్వాన్ని చెప్పేలా నీ పదాలు ఉన్నాయి. ఎవరి ఫోటో మీద ఈ పదాలు రాశావో.. ఆయనపై దేశ ప్రజలకు ఉన్న ప్రేమాభిమానాలు తెలుసుకోవాలి. నీలాంటి పిచ్చి వాళ్లు తప్పించిన ఆయన వెంట యావత్ దేశం నిలిచిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనను ఇంత సూటిగా విమర్శించిన తర్వాత అల్కా ఊరుకుంటారా? విచక్షణ మరిచి.. వ్యక్తిగత విమర్శలతో యోగేశ్వర్ ను టార్గెట్ చేశారు.

ఆమె పెట్టిన ట్వీట్ ను యథాతధంగా ఇవ్వాలన్నా సిగ్గుపడే పరిస్థితి. కానీ.. తీవ్రత అర్థం కావాలంటే ఆమె మాటల్ని చెప్పటానికి మినహా మరో మార్గం లేదు. ‘‘ఓరేయ్ యోగేశ్వర్ దత్ గా.. నీ తండ్రి ఎవరో నీ తల్లిని అడుగు. నీ తండ్రితో డీపీ పెట్టుకోవటానికి నీకు సిగ్గుగా ఉందా? ఎందుకు? నీ డీపీలో నువ్వు ఎవరినైతే దాచేస్తున్నావో.. అతన్ని నీ తండ్రిగా నీ తల్లి చెప్పినప్పుడు నువ్వు అంగీకరించాలి. ఎందుకంటే అమ్మ ఎప్పుడూ అబద్ధం చెప్పదు. నువ్వు ఇలాంటి తప్పు చేయటానికి కారణం కనిపించట్లేదు’’ అంటూ ట్వీట్ తో ఫైర్ అయ్యారు. ఆమె చేసిన ట్వీట్ పై పలువురు మండిపడుతున్నారు.

తనను టార్గెట్ చేసిన అల్కా ట్వీట్ పై స్పందించిన యోగేశ్వర్ దత్.. గౌరవ మర్యాదలు లేని వారి నుంచి ఇంతకంటే ఏం ఆశించగలమని పేర్కొన్నారు. యోగేశ్వర్ పై ఆమె చేసిన ట్వీట్ ను తప్పు పడుతూ పలువురు ఫైర్ అవుతున్నారు. తరచూ ఏదో ఒక వివాదంలో ఉంటూ వార్తల్లో ఉండే అల్కా.. మరికొన్ని రోజుల పాటు తాజాగా ఎపిసోడ్ తో బండి లాగించేయొచ్చు.సైద్ధాంతికంగా విభేదాలు ఎన్ని ఉన్నా.. ఇలా వ్యక్తిగత అంశాల్ని సమయం.. సందర్భంతో పని లేకుండా ప్రస్తావించటానికి మించిన దారుణం మరొకటి ఉండదు. తాజా ఎపిసోడ్ లో ఆమె చేసిన వ్యాఖ్యల్ని ఛీ.. ఛీ అనకుండా ఉండలేమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.