Begin typing your search above and press return to search.
కేసీఆర్ కు అమ్ముడుపోయిన ఏపీ ఎమ్మెల్యే!
By: Tupaki Desk | 31 Aug 2016 10:56 AM GMTమాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అధికార టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు - ఆయా పార్టీల అధినేతలు చంద్రబాబు - వైఎస్ జగన్ లు లక్ష్యంగా సాగిన వాదోపవాదాల ప్రక్రియలో ఇపుడు పొరుగు రాష్ట్రం తెలంగాణ వచ్చిచేరింది. తాజాగా ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి అమ్ముడుపోయాడని యరపతినేని ఆరోపించారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ తన పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు - మరో ఎంపీని టీఆర్ ఎస్ లో చేర్చి అక్కడి ముఖ్యమంత్రి ద్వారా అబ్ది పొందారని విమర్శించారు. ఇందులో ప్రథమంగా లాభపడింది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అని ఆరోపించారు. ఖమ్మం జిల్లాలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి తెలంగాణ ప్రభుత్వం ఇసుకరేవు కేటాయించడమే ఇందుకు నిదర్శనమని యరపతినేని ఆరోపించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆంధ్రప్రదేశ్ లో పుట్టి తెలంగాణలో పుష్కర స్నానం చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. రైతులు నానా ఇబ్బందులు పడుతున్నా చుక్కనీరు సాగర్ నుండి వదలకుండా పైశాచికంగా ప్రవర్తిస్తున్న తెలంగాణపై - ఆ రాష్ట్ర ప్రభుత్వంపై వీల్లకు ఎంత ప్రేమ వుందో ఈ ఉదంతం ద్వారా అర్దమవుతుందన్నారు. యరపతినేని తన ప్రయోజనాల కోసం తెలంగాణ కేసీఆర్‌కు అమ్ముడుపోయారని ఆరోపించారు. ఈ ప్రశ్న వేసినందుకే పిన్నెల్లి స్థాయి మరచి ఆరోపణలు చేస్తున్నారన్నారు. హైదరాబాద్ లో సీతరామయ్య అనే వ్యక్తి ఆస్తిని పిన్నెల్లి కబ్జా చేస్తే ఆవిషయం మీడియాలో కూడా వచ్చిందన్నారు.