Begin typing your search above and press return to search.
‘కేసీఆర్ ను అప్పుడే ఎందుకు దించే ప్రయత్నం చేస్తున్నారు’
By: Tupaki Desk | 4 Feb 2021 11:30 PM GMTఆ ఇద్దరు నేతలు భిన్న ధ్రువాలు. పేర్లు ఒక్కటే అయినా..పార్టీలు వేర్వేరు. వ్యవహారశైలి.. తీరు వేర్వేరు. ఒకరు చిర్రుబుర్రులాడుతూ ఉండే పెద్ద మనిషి అయితే.. మరొకరు సరదాగా ఉంటూ చురకలు వేసే యువనేత. ఇంతకూ వారిద్దరు ఎవరంటారా? ఒకరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అయితే.. మరొకరు కాంగ్రెస్ సీనియర్ నేత.. ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి. అసెంబ్లీ కమిటీ హాలులో జరిగే సమావేశానికి వెళుతునన సమయంలో ఈ ఇద్దరు జీవన్ రెడ్డిలు ఎదురెదురు పడ్డారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పలుకరించారు. త్వరలో కేటీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారన్న వార్తల నేపథ్యంలో వారి మధ్య మాటల్లో అనూహ్యంగా ఈ టాపిక్ వచ్చింది. మంత్రిగా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారని జీవన్ రెడ్డిని ప్రశ్నించగా.. అంతా మీ అభిమానం అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. పెద్దాయన్ను అప్పుడే ఎందుకు దించే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ జీవన్ రెడ్డి ప్రశ్నించారు.
దీనికి బదులుగా టీఆర్ఎస్ జీవన్ రెడ్డి బదులిస్తూ.. దేశంలో రైతులకు కేసీఆర్ అవసరం ఉందని బదులిచ్చారు. కేసీఆర్ ప్రధానమంత్రి అయ్యాక కేటీఆర్ గురించి మాట్లాడండి.. అప్పుడే ఎందుకు దించాలనుకుంటున్నారంటూ కాంగ్రెస్ జీవన్ రెడ్డి చలోక్తి విసిరారు. అనంతరం ఇరువురు మధ్య గతంలో కాంగ్రెస్ జీవన్ రెడ్డిని టీఆర్ఎస్ లోకి రమ్మన్న వైనంపై మాటలు నడిచాయి. నేను టీఆర్ఎస్ లోకి రాకపోవటంతో.. మరో జీవన్ రెడ్డిని తయారు చేశారుగా? అంటూ చేసిన వ్యాఖ్యలకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పెద్దగా నవ్వేశారు. రాజకీయంగా విబేదాలు ఉండొచ్చు. కానీ.. ఇలాంటి సరదా సంభాషణలకు అవకాశం ఉండేలా రాజకీయం ఉండాలన్న భావన.. వీరిద్దరి సంభాషణను చూస్తే కలుగక మానదు.