Begin typing your search above and press return to search.
కుప్పం రచ్చ.. చంద్రబాబు వర్సెస్ డీఎస్పీ.. ఏం జరిగింది?
By: Tupaki Desk | 5 Jan 2023 9:11 AM GMTతన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించేందుకు వెళ్లిన టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ను అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో డీఎస్పీ స్థాయి అధికారికి చంద్రబాబుకు మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరిగింది. చంద్రబాబు డీఎస్పీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దూరులో చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో డీఎస్పీ అక్కడికి రావడంతో చంద్రబాబుఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య అసలు ఏం జరిగింది? చంద్రబాబు ఏమన్నారు.. డీఎస్పీ ఏం సమాధానం చెప్పారు? అనేది ఆసక్తిగా మారింది.
తొలుత చంద్రబాబు డీఎస్పీని చూస్తూనే.. ప్రశ్నల వర్షం కురిపించారు. అనుమతి అడిగితే తిరస్కరించా మన్నారు. నేను ఒక ఎమ్మెల్యేగా వచ్చా. నా ప్రజలతో నేను మైకులో మాట్లాడాలనుకుంటున్నా. మీరు ఎక్కడ అనుమతి ఇస్తారు? ఎందుకు ఇవ్వరో స్పష్టంగా చెప్పాలి. నా కార్యక్రమాలకు ఎందుకు అనుమతివ్వలేదో చెప్పాలని నేరుగా అడుగుతున్నా. నా నియోజకవర్గానికి రాకుండా నేను పారిపోవాలా?
దీనికి డీఎస్పీ స్పందిస్తూ.. తాము వెళ్లమని చెప్పలేదన్నారు.
చంద్రబాబు: మరి నాకు మైకు ఎందుకివ్వరు? నా రోడ్‌షోకు ఎందుకు అనుమతివ్వరు? నా గత పర్యటనలో ఇదే నియోజకవర్గంలో 74 మంది పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టారు. పది మందిని అరెస్టు చేసి, నెల రోజులు జైల్లో పెట్టారు. నన్నూ జైల్లో పెట్టండి. అందరికీ బేడీలు వేయండి. నిన్ననే జగన్ వెళ్లాడు.. ఆయన రోడ్డుపై వెళ్లొచ్చా? వైసీపీకి ఒక చట్టం, నాకు ఒక చట్టమా? అని నిప్పులు చెరిగారు.
డీఎస్పీ: లిఖితపూర్వకంగా మీరడిగితే ఇస్తాం సార్.
చంద్రబాబు: నేను మౌఖికంగా అడుగుతున్నా. నియోజకవర్గంలో తిరగాలని అడుగుతున్నా.
డీఎస్పీ: నియోజకవర్గంలో తిరిగేందుకు అభ్యంతరం లేదు సార్
చంద్రబాబు: సమావేశం పెట్టాలని అడుగుతున్నా.
డీఎస్పీ: సమావేశం గ్రామాల్లో పెట్టుకునేందుకు అభ్యంతరం లేదు. రోడ్డుపై అయితేనే అభ్యంతరం.
చంద్రబాబు: మైకు ఎందుకు ఇవ్వలేదు?
డీఎస్పీ: మైకు ఎక్కడ పెడతారో ఆ ప్రదేశం చెప్పాలని అడిగాం అంతే సర్.
చంద్రబాబు: ఎక్కడ ప్రజలు ఉంటే అక్కడికి వెళ్తాం. ప్రైవేటు స్థలాల్లో ఎక్కడ పెట్టుకోవాలి. నా వాహనం ఇవ్వరా?
డీఎస్పీ: ఇస్తాం సార్. ఎక్కడికి పోతుంది?
చంద్రబాబు: నేను వాహనం ఎక్కి ప్రజలనుద్దేశించి మాట్లాడాలి. ఇప్పుడు ఎక్కడ నుంచి మాట్లాడాలి?
డీఎస్పీ: రోడ్డు మీద కాకుండా పల్లెల్లో మాట్లాడవచ్చు.
చంద్రబాబు: నా వాహనం తీసుకెళ్లారు. లోపల పెట్టమంటే అక్కడే సమావేశం పెడతాను. ఇవ్వరా?
డీఎస్పీ: వాహనాలు ఇస్తాం.. లోపల పల్లెల్లో మైక్ అనుమతి ఉంది. వాహనం కాకుండా మైక్‌లో మాట్లాడవచ్చు.
చంద్రబాబు: వాహనంపై మాట్లాడేందుకు లేదా?
డీఎస్పీ: వాహనంపై జాతీయ, రాష్ట్ర, మున్సిపల్, పంచాయతీ రహదారులపై మాట్లాడకూడదు.
చంద్రబాబు: గ్రామాల్లో పంచాయతీ రోడ్డు కాకుంటే ఏముంది?
డీఎస్పీ: పల్లెల్లో అభ్యంతరం చెప్పడం లేదు. జీవో ప్రకారం వెళ్తే చాలు.
చంద్రబాబు: మీరు నా వాహనం ఇచ్చే వరకు పల్లెలకు వెళ్లి తిరుగుతా అంటూ ఆయన ముందుకు కదిలారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.