Begin typing your search above and press return to search.
కవిత ఈడీ విచారణ వేళ ‘వాంటెడ్ బీఎల్ సంతోష్’ పోస్టర్ల కలకలం
By: Tupaki Desk | 16 March 2023 4:02 PM GMTబీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ వార్ ఇప్పుడు ఢిల్లీకి చేరింది. కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ఈడీ విచారణ వేళ బీజేపీపై పోస్టర్లు, ఫ్లెక్సీల వార్ చేపట్టింది బీఆర్ఎస్ దండు. ఈడీ విచారణకు కవిత హాజరవుతున్న వేళ సిట్ విచారణ తప్పించుకొని తిరుగుతున్న బీఎల్ సంతోష్ ను టార్గెట్ చేసుకున్నారు కొందరు. హైదరాబాద్ నగరంలో ముఖ్య నాయకుడు బీఎల్ సంతోష్ కనిపించడం లేదని వివిధ ప్రాంతాలలో పోస్టర్లు వేసి ఆయనను టార్గెట్ చేశారు.
ఎమ్మెల్యేల కొనుగోలులో సిద్ధహస్తుడు బీఎల్ సంతోష్ అంటూ ఆయన ఫొటోతో పోస్టర్లు వేసి రచ్చ చేశారు. మోడీ హామీ ఇచ్చిన 15 లక్షల రూపాయలు అంటూ సంతోష్ ను టార్గెట్ చేసి పోస్టర్లు రిలీజ్ చేశారు. బీఎల్ సంతోష్ ను పట్టించిన వారికి మోడీ హామీ ఇచ్చిన 15 లక్షల రూపాయలు బహుమానం ఇస్తామని పోస్టర్లలో రాసుకొచ్చారు.
మొయినాబాద్ ఫాంహౌస్ లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రధాన సూత్రధారి అయిన బీఎల్ సంతోష్ కేంద్ర దర్యాప్తు సంస్థల అండదండలతో ఈ కేసు నుంచి తప్పించుకున్నారని.. సిట్ విచారణకు రాకుండా తప్పించుకు తిరుగుతున్నారని ఆయనను టార్గెట్ చేస్తున్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ను ఇరికించాలన్న కేసీఆర్ సర్కార్ ప్రయత్నాలకు కోర్టులో చెక్ పడింది. ఈ కేసును సీబీఐకి బదలాయించాలని కోర్టు ఆదేశించడం.. దాన్ని వ్యతిరేకిస్తూ కేసీఆర్ సర్కార్ ఏకంగా సుప్రీంకోర్టుకు ఎక్కి పోరాడుతోంది.
ఈ క్రమంలోనే ఢిల్లీ లిక్కర్ స్కాంలో రామచంద్ర పిళ్లైని అరెస్ట్ చేయడం.. ఈయన కవిత బినామీగా ఈడీ చార్జ్ షీట్ లో పేర్కొని కవితను విచారణకు పిలవడం జరిగింది.
బీఎల్ సంతోష్ కేంద్ర దర్యాప్తు సంస్థల అండతో సిట్ విచారణకు రాకుండా తప్పించుకు తిరుగుతున్నారని బీఆర్ఎస్ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వెలిసిన పోస్టర్లు బీఎల్ సంతోష్ పై తెలంగాణలో చర్చకు కారణంగా మారాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.