Begin typing your search above and press return to search.
అనువాదకులు కావలెను.. బీజేపీలో హాట్ టాపిక్!!
By: Tupaki Desk | 11 April 2021 6:15 PM GMTకొన్ని కొన్ని విషయాలు చిత్రంగా ఉంటాయి. వినేందుకు కూడా ఆశ్చర్యంగా అనిపిస్తాయి. ఇలాంటి సంఘట న ఒకటి.. ఏపీ బీజేపీలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్‌గా మారి.. ఆ పార్టీ నేతల మధ్య హల్ చల్ చేస్తోంది. తిరుపతి పార్లమెంటు స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికను బీజేపీ నాయకులు ప్రతిష్టాత్మ కంగా తీసుకున్నారు. ఇక్కడ గెలిచి తీరాలని కంకణం కట్టుకున్నారు. ఈ క్రమంలో స్థానిక నేతలతో పాటు.. కేంద్రం నుంచి జాతీయ నేతలను కూడా ఇక్కడకు తీసుకువచ్చి.. ప్రచారం చేయిస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా సోమవారం.. తిరుపతి రానున్నారు.
తొలుత తిరుపతిలో పెద్ద ఎత్తున ఎన్నికల ర్యాలీలో పాల్గొని .. అనంతరం నెల్లూరు జిల్లా నాయుడుపేట గ్రౌండ్స్‌లో భారీ ఎత్తున నిర్వహిస్తున్న సభలో నడ్డా ప్రసంగించనున్నారు. ఇంతవరకు రాష్ట్ర పార్టీ చీఫ్ సొము వీర్రాజు సక్సెస్ అయ్యారు. అయితే.. ఇప్పుడే పెద్ద చిక్కు వచ్చి పడింది. నడ్డాకు తెలుగు రాదు. ఆయన కేవలం హిందీలోనే మాట్లాడతారు. దీంతో ఆయన ప్రసంగాన్ని తెలుగులోకి అనువదించేవారు అవసరం అయ్యారు. నిజానికి చాలా మంది జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతున్న నేతలు ఏపీ బీజేపీకి ఉన్నప్పటికీ.. మక్కీకి మక్కీగా ట్రూ ట్రాన్సలేషన్ చేసే నేతలు.. మాత్రం లేరు.
గతంలో అప్పటి జాతీయ అధ్యక్షుడు.. ప్రస్తుత కేంద్ర మంత్రి అమిత్ షా ఏపీలో పర్యటనలకు వచ్చినప్పు డు.. ఆయన ప్రసంగాలను.. మహిళా నాయకురాలు.. పురందేశ్వరి అనువదించేవారు. అయితే.. ఆమె సరి గా అనువదించడం లేదని.. వ్యాఖ్యలను స్కిప్ చేస్తున్నారని.. తన సొంత అభిప్రాయాలు జోడిస్తున్నారని.. భావించిన సీనియర్లు.. ఆమెను పక్కన పెట్టారు. సాధారణంగా.. ఆయా సభలు.. ఎన్నికల ప్రచార సభలు కావు. అప్పట్లోనే.. అనువాదం సరిగా చేయలేక పోయారని.. అనుకున్న పురందేశ్వరిని.. ఇప్పుడు కీలకమైన ఎన్నికల ప్రచారంలో వినియోగించుకునే అవకాశం లేదు.
దీంతో ఎవరు అనువదిస్తారు? అనే ప్రశ్న బీజేపీ నేతల మధ్య చర్చగా మారింది. ఎమ్మెల్సీ విష్ణువర్ధన్‌రెడ్డి కానీ.. ఎంపీ జీవీఎల్ కానీ.. అయితే.. బాగానే ఉంటుందని అనుకున్నా.. వీరికి కూడా సేమ్ ప్రాబ్లం ఉంది. సో.. ఇప్పుడు వీరు కూడా అనువాదకుల జాబితాలో లేక పోవడం గమనార్హం. మరి కొద్దిగంటల్లోనే నడ్డా వస్తుండడం.. ఆయన ప్రసంగాలు ధాటిగా ఉంటాయని.. ఎక్కడా ఆగకుండా.. ఓ గంగా ప్రవాహం మాదిరిగా ఆయన మాట్లాడతారని.. సో.. అంతే స్తాయిలో అనువాదం చేసేవారు కావాలని.. బీజేపీ నేతలు తమ ఫోన్ సంభాషణల్లో అనువాద నేతల కోసం వెతుకులాట ప్రారంభించారు. మరి చివరికి ఎవరు దొరుకుతారో చూడాలి.