Begin typing your search above and press return to search.
రోడ్డు మార్గంలో హైదరాబాద్ కు వద్దామనుకుంటున్నారా? జర జాగ్రత్త
By: Tupaki Desk | 15 Oct 2020 3:00 PM ISTగడిచిన కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షం ఒక ఎత్తు అయితే.. మొన్న (అక్టోబరు 13) కురిసిన భారీ వర్షం కారణంగా హైదరాబాద్ మహానగరమే కాదు.. దాని శివారు ఆగమాగమైంది. అంతేనా.. భాగ్యనగరికి వచ్చే దారులన్ని ఇప్పుడు దారుణమైన పరిస్థితుల్లో ఉన్నట్లు చెబుతున్నారు. నిత్యం హైదరాబాద్ మహానగరికి లక్షలాదిగా వచ్చిపోతుంటారు. కరోనా పుణ్యమా అని ప్రజా రవాణా పరిమితం కావటంతో.. ఈ సంఖ్య తగ్గింది. అయినప్పటికీ ప్రైవేటు వాహనాలతో రాకపోకలు జోరుగానే సాగుతున్నాయి.
తాజాగా కురిసిన భారీ వర్షాలతో పలు జాతీయ రహదారులు దారుణంగా దెబ్బ తిన్నాయి. ఎక్కడ ఎంత గొయ్యి ఉందో అర్థం కాని పరిస్థితి. జాతీయ రహదారి మీద వరద నీరు ముంచెత్తటంతో భారీగా వాహన రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జాం చోటు చేసుకుంది. హైదరాబాద్ కు నాలుగు వైపులా ఉండే జాతీయ రహదారుల పరిస్థితి ఏమిటి? అవెలా ఉన్నాయి? అన్నది చూస్తే.. ఇప్పటికిప్పుడు హైదరాబాద్ మహానగరానికి రావాలన్న జర్నీప్లాన్ వేసుకోకపోవటమే మంచిదన్న మాట వినిపిస్తోంది.
ఎందుకంటే.. రోడ్లు భారీగా దెబ్బతినటమే దీనికి కారణం. బెంగళూరు హైవేనే తీసుకుంటే.. అరాంఘర్ - శంషాబాద్ మార్గం గగన్ పహాడ్ లోని అప్పా చెరువు తెగింది. దీంతో.. తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు వాహనదారులు. కొన్ని వాహనాలు అయితే.. వరద తాకిడికి కొట్టుకుపోయినట్లుగా చెబుతున్నారు. దీంతో ప్రత్యామ్నాయ మార్గాల్ని సూచిస్తూ వాహనదారులకు చెబుతున్నారు. అయినప్పటికి వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఎక్కువగా ప్రయాణాలుసాగే హైదరాబాద్ - విజయవాడ హైవే విషయానికి వస్తే.. అబ్దుల్లాపూర్ మెట్ దగ్గరి రెడ్డి కుంట చెరువు తెగింది. దీంతో వరద నీటి తీవ్రత ఎక్కువగా ఉండటంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. గంటల తరబడి వెయిట్ చేయాల్సి వస్తోంది. కిలోమీటర్లమేర ట్రాఫిక్ నిలిచింది. రోడ్ల మీద గోతులుకూడా ఎక్కువగానే ఉన్నాయి. శ్రీశైలం హైవేలోనే రహదారుల మీద వరద నీరు నిలచింది. ఈ రోజుకు (గురువారం) పరిస్థితి మెరుగుపడినా.. వర్షాల జోరు తగ్గిన తర్వాతే ప్రయాణం పెట్టుకుంటే మంచిదని చెబుతున్నారు.
నాగపూర్ హైవే మార్గంలోనూ వాహనదారులకు తిప్పలు తప్పని పరిస్థితి. భారీ వర్షంతో మెదక్ జిల్లా మనోహరాబాద్ వద్ద జరుగుతున్న పనులు ఇబ్బందుల్ని మరింతగా పెంచాయి. అండర్ పాస్ పూర్తిగా నీటితో నిండిపోవటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దీంతో.. తుప్రాన్.. నాచారం.. గజ్వేల్.. ములుగు.. కిష్టాపూర్.. మేడ్చల్ మీదుగా వాహనాల్ని తరలించారు. వరంగల్ హైవేలోని ఉప్పల్ నల్లచెరువు కట్ట తెగి కూడా రాకపోకలకు తీవ్ర విఘాతాన్ని కల్పించాయి. ఘట్ కేసర్ నుంచి యామ్నాంపేట మీదుగా ఈసీఐఎల్ నుంచి సికింద్రాబాద్ వైపు వాహనాల్ని మళ్లించారు. ఇదంతా చూసినప్పుడు ఆచితూచి అన్నట్లుగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది.