Begin typing your search above and press return to search.

మీరు అలా చేస్తే మోడీని పర్సనల్ గా కలవొచ్చు

By:  Tupaki Desk   |   29 May 2016 1:47 PM GMT
మీరు అలా చేస్తే మోడీని పర్సనల్ గా కలవొచ్చు
X
సామాన్యులకు ప్రధాని నరేంద్ర మోడీని కలిసే అవకాశం ఉంటుందా? ఛాన్సే లేదు. కానీ.. ఇప్పుడా అవకాశం అందరికి రానుంది. కాకుంటే.. ఓ చిన్న క్విజ్ ను విజయవంతంగా పూర్తి చేస్తే.. మోడీని కలుసుకునే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. మోడీ సర్కారు అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి అవుతున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. గడిచిన రెండేళ్లలో మోడీ సర్కారును అనుసరిస్తున్న విధానాలు.. ప్రవేశ పెట్టిన పథకాలు.. సాధించిన విజయాలకు సంబంధించిన 20 ప్రశ్నల్ని క్విజ్ రూపంలో ఇస్తారు.

వీటికి 5 నిమిషాల వ్యవధిలో జవాబులు చెప్పాల్సి ఉంటుంది. ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన వారిలో అత్యుత్తమ ప్రతిభ కనపర్చిన వారికి మోడీ సంతకంతో కూడిన సర్టిఫికేటును ప్రదానం చేయటంతో పాటు.. కలుసుకునే అవకాశం ఉంది. ఇందుకోసం గవర్నమెంట్.ఇన్ వెబ్ సైట్ లో మొబైల్ నెంబరు.. ఈమొయిల్ అడ్రస్ నమోదు చేసుకోవటం ద్వారా క్విజ్ లో పాల్గొనే అవకాశం ఉంది. మోడీ సర్కారు చేసే కార్యక్రమాల మీద పట్టున్న వారు ప్రయత్నిస్తే ప్రయోజనం ఉంటుందని చెప్పాలి. ఒకసారి ట్రై చేసి చూడండి.. అన్ని కలిసి వస్తే.. ప్రధాని మోడీని కలుసుకోవచ్చు సుమా.