Begin typing your search above and press return to search.
అప్పుడు ఆర్సీబీని వీడాలనుకున్నా : విరాట్ కోహ్లీ
By: Tupaki Desk | 20 April 2023 4:00 PM GMTఐపీఎల్ ప్రారంభం నుంచి విరాట్ కోహ్లీ కేవలం ఒకే ఒక్క జట్టుతో కలిసి సాగుతున్నారు. విరాట్ కోహ్లీ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దాదాపు ఒకరికొకరు పర్యాయపదాలు. 34 ఏళ్ల భారత గ్రేట్ టోర్నమెంట్ చరిత్రలో 2008లో ప్రారంభమైనప్పటి నుండి అదే ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించిన ఏకైక ఆటగాడు మన విరాట్ కోహ్లీనే. 2013-2021 మధ్య 9 సీజన్లలో ఫ్రాంచైజీకి నాయకత్వం వహించాడు. అయితే కోహ్లీ కెప్టెన్సీలో ఆర్సీబీ ఒక్కసారి కూడా కప్ కొట్టలేదు. కెప్టెన్‌గా ట్రోఫీని ముద్దాడలేకపోయాడు.కానీ ఫ్రాంచైజీకి బ్యాట్‌తో కోహ్లీ ఎన్నో సార్లు టీంను గెలిపించాడు.
అనేక సందర్భాల్లో ఆర్సీబీ లీగ్‌లో తన ఏకైక ఫ్రాంచైజీ అని కోహ్లీ పేర్కొన్నాడు, అయితే స్టార్ బ్యాట్స్‌మన్ టోర్నమెంట్ ప్రారంభ సంవత్సరాల్లో వేరే టీంలోకి మారుదామని అనుకున్నాడట. టాప్ ఆర్డర్ కోసం అన్వేషణలో మరొక ఫ్రాంచైజీతో మాట్లాడినట్లు వెల్లడించాడు. మొదటి మూడు సీజన్లలో కోహ్లి ఆర్సీబీ తరుపున నం.5 లేదా 6లో ఎక్కువగా బ్యాటింగ్ చేశాడు. టాప్ ఆర్డర్ లో ఆడే అవకాశం బెంగళూరు తరుఫున రాలేదు. దీంతో వేరే జట్టుకు మారాలని కోహ్లీ అనుకున్నాడట.. టాప్ ఆర్డర్ లో ఛాన్స్ ఇస్తారా? అని వేరే ఫ్రాంచైజీని సంప్రదించాను. కానీ వారు ఆసక్తి చూపించలేదు.
2011 వరకూ టీమిండియా తరుఫున కోహ్లీ కీలక ఆటగాడిగా మారారు. ఆ తర్వాత 2011 వేలంలో కోహ్లీ సంప్రదించిన ఫ్రాంచైజీ మళ్లీ వేలంలోకి రావాలని. ఈసారి తీసుకుంటామని సంప్రదించిందట. కానీ కోహ్లీ కుదరదు రాను అని చెప్పాడట.. బెంగళూరుతోనే కొనసాగుతానని కోహ్లీ స్పష్టం చేశాడట. భారత జట్టులో సెటిల్ అయిపోయిన కోహ్లి తనకు చాలా మద్దతు ఇచ్చిన ఆర్సీబీ తోనే ఉండాలని డిసైడ్ అయ్యాడట.
ఆర్సీబీతో ఈ భాగస్వామ్యానికి , ప్రయాణానికి నేను ఎందుకు అంత విలువ ఇస్తానంటే.. ఐపీఎల్ మొదటి 3 సంవత్సరాలలో, వారు నాకు చాలా మద్దతు ఇచ్చారు. వేలం వచ్చినప్పుడు కూడా తనను నిలుపుకొని మద్దతుగా నిలబడ్డారు. ఆ సమయంలో ఆర్సీబీ కోచ్ అయిన రే జెన్నింగ్స్‌కి ఇదే విషయం చెప్పాను. 'నేను టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయాలనుకుంటున్నాను. నేను టీమిండియా తరపున టాప్ 3 వద్ద బ్యాటింగ్ చేస్తాను . ఐపీఎల్ లోనూ నేను 3వ స్థానంలో బ్యాటింగ్ చేయాలనుకుంటున్నాను అని చెప్పాను. వారు, 'సరే, అని వన్ డౌన్ లో వెళ్లనిచ్చారు. నాకు అవసర మైన సమయంలో వారు నాపై విశ్వాసం చూపించారు. నేను నా అంతర్జాతీయ కెరీర్‌లో అప్పుడే ఎదుగుతున్నాను" అని జియోసినిమాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లీ ఈ విషయాన్ని బయటపెట్టాడు.
ఆ సమయంలో నేను మాట్లాడిన మరొక ఫ్రాంచైజీ వారు నా మాట వినడానికి కూడా ఆసక్తి చూపలేదు. 'ఎక్కడైనా టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం నాకు లభిస్తే...' అదే ఫ్రాంచైజీ కోసం ఆడుదామని అనుకున్నాను. నాకు మద్దతు ఇచ్చే ఫ్రాంచైజీతో నేను ఎప్పుడూ ఉంటాను' అని కోహ్లీ అన్నాడు. కోహ్లిని తీసుకునే అవకాశాన్ని నిరాకరించిన ఫ్రాంచైజీపై ఏంటని ఉతప్ప అడిగినా కూడా కోహ్లీ బయటపెట్టలేదు.
కోహ్లి 2021లో ఆర్సీబీ కెప్టెన్‌గా వైదొలిగాడు. మరుసటి సంవత్సరం కేవలం బ్యాటర్ గానే 2022లో అన్ని ఫార్మాట్లలో అద్భుతమైన పునరాగమనం చేసాడు. కోహ్లీ ఆర్సీబీ కోసం అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆడుతూనే ఉన్నాడు.