Begin typing your search above and press return to search.

కొత్త వాహనం కొనాలనుకుంటున్నారా , పార్కింగ్ స్థలం చూపించాల్సిందే !

By:  Tupaki Desk   |   2 Dec 2020 7:15 AM GMT
కొత్త వాహనం కొనాలనుకుంటున్నారా , పార్కింగ్ స్థలం చూపించాల్సిందే !
X
ప్రస్తుత రోజుల్లో అవసరానికి తగ్గట్టుగా వాహనాలు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. కొందరు తమ ఇంట్లో ఎంతమంది ఉంటే , అన్ని వాహనాల్నికొంటుంటారు. దీని వల్ల కాలుష్యం కూడా రోజురోజుకి పెరిగిపోతుంది. ఇదిలా ఉంటే అసలు కొత్త వాహనం కొనడం పెద్ద సమస్య కాదు , దాన్ని పార్కింగ్ చేయడం ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ట్రాఫిక్‌ రద్దీ, పార్కింగ్‌ స్థలం కొరతతో నగరవాసులు అల్లాడిపోతున్నారు.

ఈ నేపథ్యంలో బెంగుళూరు నగరంలో అస్తవ్యస్తంగా ఉన్న పార్కింగ్‌ వ్యవస్థపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇప్పటి నుండి ఎవరైనా కొత్తవాహనాలను కొనాలని అనుకుంటే , ముందు ఆ వాహనం పార్కింగ్ ‌కు సొంత స్థలం ఉందని ప్రమాణపత్రం ఇవ్వాలని తీర్మానించింది. స్మార్ట్‌ పార్కింగ్‌ వ్యవస్ను అమలు చేయబోతుంది. సీఎం విధానసౌధ లో ఉన్నతాధికారులతో పార్కింగ్‌ సమస్యపై చర్చలు జరిపారు. దీనిపై విధానాల రూపకల్పన కోసం ఓ కమిటీని వేశారు. ఎంజీ రోడ్డు, బ్రిగేడ్‌ రోడ్డు మాదిరిగా నగరమంతటా ప్రధాన స్థలాల్లో వాహనాల పార్కింగ్‌ కు నిర్ణీత ఫీజులను వసూలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇళ్ల పక్కన ఉండే ఖాళీ స్థలాలను పార్కింగ్‌ ప్రదేశాలుగా వాడుకోవాలని చర్చించారు. కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత పార్కింగ్‌ ప్రదేశాలను ఖరారు చేస్తారు.