Begin typing your search above and press return to search.
కారు కొనాలనుకుంటున్నారా? లేట్ చేస్తే ఇబ్బందేనట
By: Tupaki Desk | 16 Feb 2021 12:30 AM GMTకారు కొనాలన్న ఆలోచనలో ఉన్నారా? ఏడాది మొదట్లో ఎందుకు? కాస్త ఆలస్యంగా కొనాలనుకుంటున్నారా? అయితే.. తప్పు చేస్తున్నట్లే. ఎందుకంటే.. దేశంలో కార్ల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. కారు ఉత్పత్తికి వినియోగించే ముడిసరుకుల ధరలు అంతకంతకూ పెరిగిపోతున్న వేళలో.. కార్ల ధరలు పెంచటం మినహా మరో మార్గం లేదన్న మాటను కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి.
కాలుష్య నియంత్రణ కోసం కార్లలో వినియోగించే రోడియం.. పల్లాడియం.. స్టీల్ వంటి ఉత్పత్తుల ధరలు పెరిగిపోవటంతో.. దాని భారం అంతిమంగా వినియోగదారుల మీద వేసేందుకు కార్ల కంపెనీలు సిద్ధమవుతున్నాయి. కీలకమైన రోడియం.. పల్లాడియం రెండు లోహాలు రష్యా.. సౌతాఫ్రికా నుంచి దిగుమతి అవుతుంటాయి. కోవిడ్ నేపథ్యంలో ఈ రెండు దేశాల్లోని గనులు మూతపడటం.. ఉత్పత్తి తగ్గిపోయింది. డిమాండ్ కు తగ్గ ఉత్పత్తి లేకపోవటంతో అంతర్జాతీయ మార్కెట్లో వీటి ధరలు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. కమోడిటీస్ ధరలతో పాటు సెమీ కండక్టర్ల కొరత కూడా కంపెనీల్ని ఇబ్బంది పెడుతున్నాయి. వీటిని ఎక్కువగా చైనా.. తైవాన్ నుంచి దిగుమతి చేసుకుంటారు. కరోనా కారణంగా వీటి సరఫరా గణనీయంగా తగ్గింది. ఉత్పత్తి మీదా ప్రభావం చూపటంతో ధరలు పెరగనున్నాయి. సెమీ కండక్టర్ల కొరత కారణంగా కార్ల కంపెనీలు దాదాపు ఐదు లక్షల కార్ల ఉత్పత్తి మీద ప్రభావం చూపించినట్లు చెబుతున్నారు.
సెమీ కండక్టర్ల కొరత తీరాలంటే కనీసం మరోనాలుగైదు నెలలు పడుతుందని చెబుతున్నారు. ఇప్పటికే కమోడిటీల మీద భారం పెరిగిందన్న ఉద్దేశంతో కార్ల కంపెనీలు ఈ మధ్యనే కార్ల ధరల్ని పెంచాయి. మళ్లీ ధరలు పెంచితే కొనుగోళ్ల మీద ప్రభావం పడుతుందని కార్ల కంపెనీలు భావిస్తున్నాయి. రెండు.. మూడు నెలల వరకు పరిస్థితిని సమీక్షించుకొని.. అప్పటికి పరిస్థితి మెరుగుపడని పరిస్థితుల్లో మాత్రం ధరలు పెంచటం ఖాయమంటున్నారు. ఈ నేపథ్యంలో కారు కొనుగోలు తప్పనిసరి అన్న ఆలోచనలో ఉన్న వారు.. వీలైనంత త్వరగా కొనుగోలు చేయటం మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.