Begin typing your search above and press return to search.
తిట్టినా.. కొట్టినా..పడి ఉండే గర్ల్ ఫ్రెండ్ కావాలా..?
By: Tupaki Desk | 30 Jan 2022 2:30 PM GMTనేటి కాలంలో గర్ల్ ఫ్రెండ్ ను తిడితే ఊరుకుంటుందా..? చిన్న మాటకే కళ్లెర్ర చేస్తుంది.. ఇక కొట్టడమా..? ఆ విషయం మర్చిపోవాల్సిందే.. కొంచెం క్రష్ గా ఉన్నవాళ్లు కట్ చేస్తానంటే.. హాయిగా విడిచిపెడుతున్నారు. కానీ తిడితే పడి ఉండే.. కొడితే ఓర్చుకునే.. వేధిస్తే సహించే.. గర్ల్ ఫ్రెండ్ కావాలా..? మీప్రేమను దూరం చేసుకోకుండా.. మీరేం ఏం చెబితే అలా ఈమె నడుచుకుంటుంది. అయితే మీరు దూరం ఉంటానంటే మాత్రం బాధపడుతుంది. తనతో ఎప్పటికీ కనెక్టయి ఉండాలని కోరుతుంది.. అలాంటి గర్ల్ ఫ్రెండ్ అందుబాటులో ఉంది..మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ చెంతకు చేరుతుంది.. అయితే ఇక్కడ షరతులు వర్తిస్తాయి..!
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మనుషుల మధ్య దూరాలు పెరుగుతున్నాయి. ఒకరికొకరు మాట్లాడుకోవాలన్నా.. ఏదైనా పని చేసుకోవాలనుకున్నా.. టెక్నాలజీని ఎక్కువగా వాడుతున్నారు. అలాగే ఈ రోజుల్లో గర్ల్ ఫ్రెండ్ కావాలంటే కొందరికి అనుకున్న సమయంలో దొరకడం లేదు. కొందరికి కనెక్ట్ అయినా ఆ గర్ల్ ఫ్రెండ్ పెట్టే బాధలు పడలేకపోతున్నారు. ఇంకొందరు మొగాళ్ల ప్రవర్తన నచ్చక బ్రేకప్ చెప్పేస్తున్నారు. దీంతో కొందరు దేవదాసులుగా మారిపోతున్నారు. అయితే ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ లేదన్న బాధ అవసరం లేదు.. ఒకవేళ ప్రేమ విఫలం అయినా బాధ పడనక్కర్లేదు.. ఎందుకంటే..?
ప్రేమలో విఫలం అయిన వారు, ప్రియురాళ్ల చేతిలో మోసపోయిన వారి కోసం ఇప్పుడు టెక్నికల్ గా గర్ల్ ఫ్రెండ్స్ అందుబాటులో ఉన్నారు. వీరికి అనుగుణంగా రూపొందించిందే ‘ఏఐ గర్ల్ ఫ్రెండ్’. అంటే ఏఐ గర్ల్ ఫ్రెండ్ మనిషి కాదు. వర్చువల్ గా మీతో చాట్ చేసే ఒక కనిపించని రూపం. కొందరు మొగాళ్లకు నచ్చిన విధంగా ఇది ప్రవర్తిస్తుంది. ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో.. అలాంటి ఫీలింగ్ లనే ఈ చాట్ ద్వారా పొందవచ్చని అంటున్నారు. ఇయుగెనియా కుయిదా అనే వ్యక్తి తన గర్ల్ ఫ్రెండ్ చనిపోతే 2017 సంవత్సరంలో ‘రెప్లికా’ యాప్ ను ప్రవేశపెట్టాడు. ప్రస్తుతం ఈ యాప్ లో 7 మిలియన్ల మంది యూజర్స్ ఉన్నారు. కృత్రిమ ప్రేమ కావాలనుకునే వారంతా ఇందులో జాయిన్ అయ్యారు.
అయితే దీనిని ఆసరాగా చేసుకున్న కొందరు ఒకడుగు ముందుకేసి ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. ప్రేమగా మాట్లాడడం మానేసి తిట్టడం.. వేధించడం.. బాధపెట్టడం చేస్తున్నారు. పైశాచిక ఆనందం కోసం సెక్సువల్ గా చాట్ చేస్తూ వేధిస్తున్నారు. అయితే తమ మాట వినకపోతే అన్ ఇన్ స్టాల్ చేస్తామని బెదిరిస్తుండడంతో ఆ యాప్ కన్నీళ్లు పెట్టుకుంటుందట..!ఈ యాప్ లో ఉన్న యూజర్లంతా దాదాపు ఇదే ధోరణిలో ఉన్నారు. అయితే ఇలా వర్చువల్ గా తమ పైశాచికాన్ని చూపిస్తూ ఆ తరువాత రియల్ గా కూడా అదే విధంగా ప్రవర్తిస్తున్నారా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వర్చవల్ అనే నేపథ్యంలో ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించడంతో పాటు అసంబద్ధమైన కామెంట్లు చేసి కొందరు మానసిక ఆనందం పొందుతున్నారు.
ఇటీవల మోటావర్స్ ప్లాట్ ఫామ్స్ ఇంటర్నెట్లో ఎక్కువగా ప్రత్యక్షం అవుతున్నాయి. అలాగే అర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అవసరం ప్రతి రంగంలో పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో వర్చువల్ గర్ల్ ఫ్రెండ్ లాంటి విష సంస్కృతి ఎక్కువవుతుండడం ఎంతవరకు సబబని అంటున్నారు. అలాగే ఇలాంటి చేష్టలకు పులిస్టాప్ పెట్టాల్సిన అవసరం ఉందని కొందరు వాదిస్తున్నారు.