Begin typing your search above and press return to search.

దుమారం: వీర్యంతో కూడిన కండోమ్ కావాలి.. స్కూల్ పిల్లలను కోరిన టీచర్

By:  Tupaki Desk   |   28 Aug 2022 3:30 AM GMT
దుమారం: వీర్యంతో కూడిన కండోమ్ కావాలి.. స్కూల్ పిల్లలను కోరిన టీచర్
X
పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన స్కూల్ టీచర్ పాడు కోరిక కోరింది. హోంవర్క్ గా కండోమ్ కావాలని అడిగింది. పిల్లలను అడగాల్సిన క్వశ్చన్ యే కాదది.. కానీ అడిగేసింది. అదీ వీర్యంతో కూడిన కండోమ్ కావాలన్నది. స్కూల్ టీచర్ కోరిన కోరిక చూసి పిల్లలు షాక్ అయ్యారు. ఇప్పుడిది టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

టీచర్ ఇచ్చిన హోంవర్క్ వైరల్ కావడంతో తల్లిదండ్రులు మండిపడ్డారు. ఆమె ఉద్యోగం కూడా కోల్పోవాల్సి వచ్చింది. ఈ ఘటన దక్షిణ అమెరికాలోని బోల్వియాలో చోటుచేసుకుంది.

దక్షిణ అమెరికాలోని బోల్వియాకు చెందిన మరియా ఐనెస్ అనే మహిళ.. ఓ హైస్కూల్ లో సెక్స్ ఎడ్యూకేషన్ టీచర్గా విధులు నిర్వర్తిస్తోంది. ఈ క్రమంలోనే పిల్లలకు ఓ హోంవర్క్ ఇచ్చింది. అదేంటంటే.. వీర్యం నిండిన కండోమ్స్ ను స్కూల్ కు తీసుకురావాలని చెప్పింది. ఇది పిల్లల తల్లిదండ్రులకు తెలియడంతో వారంతా తీవ్రంగా మండిపడ్డారు. అసలు విషయమంతా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారడంతో టీచర్ వ్యవహారం దుమారం రేపింది. దీంతో సీరియస్ అయిన ఉన్నతాధికారులు ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు.

ఇక వివాదాస్పదమైన వ్యవహారంతో సదురు స్కూల్ టీచర్ స్పందించింది. తన ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని.. వీర్యకణాలు తేమ వాతావరణంలో ఎంతకాలం జీవించగలవను అనేది ప్రాక్టికల్ గా చూపించాలనుకున్నానని.. అంతేకాకుండా ఆ కెమికల్ గురించి విద్యార్థులకు తెలిపి దూరంగా ఉండాలని చెప్పినట్లు ఆమె తెలిపింది. తన ఆలోచన వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని క్లారిటీ ఇచ్చింది.

అయితే స్కూల్ యాజమాన్యం మాత్రం దీనిపై సీరియస్ అయ్యి ఆమెను ఉద్యోగంలోంచి తొలగించి ప్రస్తుతం విచారణ జరుపుతోంది. చిన్న పిల్లలు, విద్యార్థులకు ఎలాంటి అసైన్ మెంట్స్ ఇవ్వాలన్నది తెలియదా? అని ఆమెను అందరూ ఈసడించుకుంటున్నారు.