Begin typing your search above and press return to search.

ఫేమస్ పిచ్చి.. లండన్ లో బెంగాల్ టైగర్!

By:  Tupaki Desk   |   26 July 2016 10:30 AM GMT
ఫేమస్ పిచ్చి.. లండన్ లో బెంగాల్ టైగర్!
X
రవితేజ బెంగాల్ టైగర్ సినిమా అందరికీ గుర్తిండే ఉంటుంది. ఆ సినిమాలో పేపర్ లో ఫోటో పడిందా, టీవీలో ఎప్పుడైనా కనిపించావా అనే ప్రశ్నలు పెళ్లిచూపులకు వెళ్లిన రవితేజకు ఎదురుపడటంతో.. రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోవాలని రవితేజ నిర్ణయం తీసుకుంటాడు. దానికి అతడు ఎంచుకున్న మార్గం.. మంత్రిగారిని ఒక బహిరంగ సభలో రాయితో కొట్టడం! దాంతో మంత్రిగారిని రాయితో కొట్టిన యువకుడు అరెస్ట్" వార్తలు రావడం, తన దృష్టిలో ఫేమస్ అయిపోవడం! ఇలాంటి విషయాలనే ఆదర్శంగా తీసుకున్నాడొ ఏమో కానీ.. ఫేమస్ అవ్వాలనే పిచ్చితో వాడినీ వీడినీ గాయపరచడం ఎందుకని తనను తానే గాయపరుచుకున్నాడు లండన్ లోని ఒక వ్యక్తి!

ఫేమస్ అవ్వాలనే పిచ్చితో ఎన్ని విన్యాసాలు - విచిత్ర వేషాలు వెయ్యవచ్చు అనే విషయంలో ఇతగాడి సాహసం పరాకాష్ట. విషయానికొస్తే.. లండన్ లోని కాస్పర్ నైట్ అనే వ్యక్తి ప్రజలందరి దృష్టిని ఎలాగైన తనవైపు తిప్పుకోవాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా తనను తాను కాల్చుకునేందుకు నిర్ణయించుకున్నాడు. తన చెంపపై గన్ పెట్టి పేల్చుకుని గాయం చేసుకున్నాడు. అనంతరం నోటి నిండా నిండిన రక్తాన్ని బయటకు ఉమ్మివేస్తూ ఆ వీడియోను రికార్డు చేసి ఫేస్ బుక్ లో పోస్ట్ చేసుకున్నాడు.

త్వరలో మ్యూజిక్ కెరీర్ ప్రారంభించాలని నిర్ణయించుకున్న ఈ వ్యక్తి తన కెరీర్ ముందుకు సాగడానికి తాను అందరికీ తెలిసిపోవడం ఎలా అని ఆలోచించి ఈ పనికిమాలిన పని చేశాడు. కాలికి ముల్లు దిగినప్పుడు - చేతికి ఇంజక్షన్ చేస్తున్నప్పుడే విలవిల్లాడిపోతారు.. అలాంటిది ఏకంగా చెంపకు తుపాకీ గురిపెట్టి కాల్చుకోవడాన్ని ఏమనుకోవాలి? ప్రస్తుతం ఈ వీడియో సోషల్ నెట్ వర్క్స్ లో వైరల్ అవుతోంది!!