Begin typing your search above and press return to search.
మోడీపై వాల్ స్ట్రీట్ సంచలన కథనంలో ఏముంది?
By: Tupaki Desk | 17 Aug 2020 7:35 AM GMTప్రఖ్యాత అమెరికన్ మీడియా సంస్థ వాల్ స్ట్రీట్ తాజాగా ప్రచురించిన ఒక కథనం సంచలంగా మారింది. రెండు బలమైన శక్తుల గురించి రాసిన రాతలు ఇప్పుడు ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. ఈ కథనం ఇప్పుడు కొత్త అంశాల్ని తెరమీదకు తేవటమే కాదు.. తొలిసారి మోడీ సర్కారుకు సరికొత్త సవాలు విసిరేలా చేసిందని చెప్పాలి. ఇంతకీ వాల్ స్ట్రీట్ సంచలన కథనంలో ఏముంది? ఎలాంటి ఆరోపణలు ఉన్నాయి? వాటికి సంబంధించిన ఆధారాల్ని ఆ మీడియా సంస్థ ఏమైనా చూపించిందా? అన్న విషయాల్లోకి వెళితే..
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ ను బీజేపీ తన గుప్పిట్లో పెట్టుకుందన్న ఆరోపణలు చేయటంతో పాటు.. బీజేపీ నేతలు హింసను ప్రేరేపించేలా.. రెచ్చగొట్టేలా పోస్టులు పెడుతున్నా.. వీడియోల్ని షేర్ చేస్తున్నా.. ఫేస్ బుక్ లైట్ తీసుకుంటుందన్న లైన్ లో వాల్ స్ట్రీట్ ఒక కథనాన్ని అచ్చేసింది. బీజేపీ నేతలు తమ ఫేస్ బుక్ పేజీల్లో పెట్టిన పోస్టులపై ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని వాల్ స్ట్రీట్ ఆరోపించింది. ఇందుకు పలు ఉదాహరణల్ని ప్రస్తావించింది.
తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ మహానగరంలోని గోషామహల్ కు ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న బీజేపీ నేత రాజాసింగ్ ను ఈ కథనంలో ప్రముఖంగా ప్రస్తావించటం విశేషం. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే అని.. ఆయన పలు వివాదాస్పద వీడియోలు.. పోస్టులు పెడుతుంటారని పేర్కొన్నారు. ఈ కరడుగట్టిన కాషాయ నేత పోస్టులు హింసను ప్రేరేపించేలా ఉన్నాయని.. అయినప్పటికి ఫేస్ బుక్ ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించింది. అంతేకాదు.. కర్ణాటక రాష్ట్రంలోని బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ సైతం తన ఫేస్ బుక్ ఖాతాలో.. కరోనా జిహాద్ అంటూ ఒక వర్గానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారని.. ఈ తరహా పోస్టుల్ని ట్విట్టర్ తొలగిస్తే.. ఫేస్ బుక్ మాత్రం ఆ పని ఎందుకు చేయలేదన్న సవాలును వాల్ స్ట్రీట్ కథనం సంధించింది.
బీజేపీ నేతలకు చెందిన ఫేస్ బుక్ అకౌంట్లో ఎలాంటి పోస్టులు పెట్టినా చూసీచూడనట్లుగా వ్యవహరించేందుకు కారణంగా ఫేస్ బుక్ ఇండియాకు కీలకంగా వ్యవహరించే అంకిత్ దాస్ కారణమన్న ఆరోపణ చేసింది. బీజేపీ నేతల ఫేస్ బుక్ పేజీలో ఉన్న వివాదాస్పద పోస్టులపై ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని.. ఆ సంస్థ ఉద్యోగులు ఆ సాహసం చేయకుండా అడ్డుకుంటున్నారని విమర్శలు చేసింది. భారత ప్రభుత్వంతో సంబంధాలు దెబ్బ తింటాయని.. అదే జరిగితే భారత్ లో జరిగే వ్యాపారంపై తీవ్ర ప్రభావం పడుతుందన్న మాట చెబుతున్నారంటూ వాల్ స్ట్రీట్ జర్నల్ సంచలన కథనాన్ని ప్రచురించింది.
తాము పబ్లిష్ చేసిన స్టోరీతో ఫేస్ బుక్ స్పందించటమే కాదు.. తాము ఆరోపించిన వ్యవహారాలపై ఆడిట్ చేయిస్తామని చెప్పారని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. తాము వివరణ కోరిన తర్వాతే రాజాసింగ్ పేజీకి ఇచ్చిన బ్లూటిక్ బ్యాడ్జ్ ను తొలగించిన వైనాన్ని ప్రస్తావించారు. వాల్ స్ట్రీట్ కథనం నేపథ్యంలో భారత్ లో బీజేపీ.. కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. బీజేపీ తీరుపై రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా దుమ్మెత్తి పోశారు. సోషల్ మీడియా ద్వారా బీజేపీ ఏ రీతిలో ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తుందన్న విషయం వాల్ స్ట్రీట్ జర్నల్ కథనంతో అర్థమవుతుందని రాహుల్ మండిపడుతున్నారు.
ఫేస్ బుక్.. వాట్సాప్ లను బీజేపీ.. సంఘ్ పరివార్ నియంత్రిస్తున్నట్లుగా రాహుల్ ఆరోపించారు. దీనిపై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ తీవ్రంగా మండిపడ్డారు. దొంగే.. తిరిగి దొంగ అన్నట్లుగా రాహుల్ తీరు ఉందన్నారు. 2019 ఎన్నికల్లో కేంబ్రిడ్జ్ అనలిటికాతో భారత ఓటర్లను ప్రభావితం చేసిన కాంగ్రెస్.. ముందు తాను చేసిన పనికి వివరణ ఇవ్వాలన్నారు. ఎన్నికలకు ముందు కేంబ్రిడ్జ్ అనలిటికా కుంభకోణంలో కాంగ్రెస్ అడ్డంగా దొరికిందని.. ఇప్పుడు తమను ఏ ముఖం పెట్టుకొని ప్రశ్నిస్తారని ఆయన ఫైర్ అవుతున్నారు. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. వాల్ స్ట్రీట్ కథనం రానున్న రోజుల్లో మరిన్ని సంచలనాలకు తెర తీస్తుందన్న మాట వినిపిస్తోంది.