Begin typing your search above and press return to search.
‘మంత్రి మాల్’ పేక మేడలా మారిందా?
By: Tupaki Desk | 17 Jan 2017 7:59 AM GMTగార్డెన్ సిటీగా పేరున్న బెంగళూరు మహానగరంలో అందరికి సుపరిచితమైన మాల్.. మంత్రి మాల్. ఆ రోజూ.. ఈ రోజూ అన్న తేడా లేకుండా నిత్యం రద్దీగా ఉండే ఈ మాల్ కు జనాల సందడి భారీగా ఉంటుంది. ఈ మాల్ లో సినిమా థియేటర్లు ఉండటంతో మరింత రద్దీగా ఉంటుంది. ఇక.. కొత్త సినిమాలు విడుదలైన వేళ.. ఇక చెప్పాల్సిన అవసరం లేదు.
మాల్ అన్నతర్వాత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో పాటు.. నాణ్యత విషయంలో చాలానే జాగ్రత్తలు తీసుకున్నారని అనుకుంటాం. కానీ.. ఫేమస్ అయిన మంత్రి మాల్ తాజా పరిస్థితి గురించి తెలిస్తే గుండెలు దడ దడ లాడాల్సిందే. ఒకవిధంగా చెప్పాలంటే గార్డెన్ సిటీ వారు చాలా అదృష్టవంతులని చెప్పాలి. పైపు లీక్ కావటంతో.. అదే పనిగా తడిచి ముద్దైన గోడ ఒకటి హఠాత్తుగా కూలిపోయింది. ఈ ఘటనలో ఒకరు గాయపడినట్లు గుర్తించారు. మరొకరిని గుర్తించాల్సి ఉందని చెబుతున్నారు.
సోమవారం ఉదయం వేళ చోటు చేసుకున్న ఈ ఘటన.. అంతకు ముందు రోజు కానీ జరిగి ఉంటే ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉందన్న మాట వినిపిస్తోంది. గోడ కుప్పకూలిన ప్రాంతానికి చేరుకున్న అధికారులు.. భవనం భద్రత గురించి ఆరా తీస్తున్నారు. ఏసీ పైపు ద్వారా మాల్ లోని మూడో అంతస్తులోకి నీటిని సరఫరా చేస్తున్నారు. దీనికి ఆనుకొని ఉన్న గోడ నీటికి బాగా నానిపోవటంతో ఈ ఘటన చోటు చేసుకుందని చెబుతున్నారు.
ఇదొక్క చోటే కాదు.. మాల్ లోని పలు గోడలు బీటలు వారి ఉన్నాయని.. ఏ క్షణంలో అయినా కూలిపోయే అవకాశం ఎక్కువగా ఉందన్న విషయాన్ని అధికారులు గుర్తించారు. వాస్తవానికి పండగ సందర్భంగా మంత్రి మాల్ కిటకిటలాడింది. ఒకవేళ.. పండగ రోజుల్లో కానీ గోడ కూలిన ఘటన చోటు చేసుకుంటే మహా విషాదంగా మారి ఉండేదని చెబుతున్నారు.
తాజా పరిణామం తర్వాత మాల్ లోని గ్యాస్ కనెక్షన్లను పూర్తిగా నిలిపివేయటంతో పాటు.. మాల్ ను తాత్కాలికంగా మూసివేయాలన్న నిర్ణయాన్ని తీసుకున్నారు. మాల్ మూడో అంతస్తు వెనుక భాగం ఏ క్షణంలో అయినా కుప్పకూలే పరిస్థితి ఉందని అధికారులు చెబుతున్నారు.ఇదిలా ఉంటే మాల్ కు అనుబంధంగా అపార్ట్ మెంట్ లు ఉన్నాయి. ఒకవేళ మూడో అంతస్తు వెనుకభాగం కానీ కూలిపోతే.. అపార్ట్ మెంట్ భద్రతపై భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.ఇదంతా చూసినప్పుడు.. భారీ ప్రాణ నష్టం లేకుండానే మంత్రి మాల్ డొల్లతనం బయట ప్రపంచానికి తెలీడటం అదృష్టంగా చెప్పక తప్పదు. పేక మేడలా మారినట్లుగా చెబుతన్న మంత్రి మాల్ ఉదంతంతో మహానగరాల్లోని అన్ని మాల్ లలోని భద్రత.. పటుత్వం మీద పరీక్షలు జరపాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/