Begin typing your search above and press return to search.
వెయిటింగ్ లిస్టుకు అనుమతి.. ఏ క్లాస్ కు ఎంతమేర అంటే?
By: Tupaki Desk | 14 May 2020 4:00 AM GMTలాక్ డౌన్ నేపథ్యంలో సర్వీసులు ఆపేసిన రైళ్లను ప్రత్యేక రైళ్ల పేరుతో కొన్ని సర్వీసుల్ని నడుపుతున్న వైనం తెలిసిందే. కన్ఫర్మ్ టికెట్లను మాత్రమే జారీ చేస్తామని.. ఈ రైళ్లలో వెయిటింగ్ లిస్టు అనేది ఉండదని తొలుత రైల్వే శాఖ ప్రకటించింది. తాజాగా తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఇప్పుడు అనుసరిస్తున్న విధానానికి భిన్నంగా కొత్త పద్దతిని తెర మీదకు తీసుకొచ్చింది.
మే 22 నుంచి ప్రత్యేక రైళ్లలో వెయిటింగ్ లిస్టు కూడా ఏర్పాటు చేయాలని డిసైడ్ చేశారు. ఇప్పుడున్న రూల్ ప్రకారం కన్ఫర్మ్ టికెట్లను మాత్రమే జారీ చేస్తారు. వెయిటింగ్ లిస్టు సౌకర్యం లేదు. ఆదాయం మీదన కన్నేసిన రైల్వే శాఖ.. వెయిటింగ్ లిస్టులతో వచ్చే ఆదాయాన్ని వదిలేందుకు సిద్ధంగా లేదు. అందుకే.. యుద్ధ ప్రాతిపదికన ఈ విధానాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. అయితే.. గతంలో మాదిరి కాకుండా.. వెయిటింగ్ లిస్టు ఏ క్లాస్ కు ఎన్ని టికెట్లు జారీ చేస్తారన్న విషయాన్ని ప్రకటించారు.
రైల్వే అధికారులు చెబుతున్న దాని ప్రకారం ఫస్ట్ ఏసీలో 20 వరకు వెయిటింగ్ లిస్టు టికెట్లు జారీ చేస్తే.. సెకండ్ ఏసీలో 50 వరకు జారీ చేయనున్నారు. త్రీ టైర్ ఏసీలో 100 వెయిటింగ్ లిస్టు టికెట్లు.. స్లీపర్ క్లాస్ లో 200 వెయిటింగ్ టికెట్లు.. ఏసీ ఛైర్ కారులో వంద వరకూ వెయిటింగ్ లిస్టు టికెట్లు జారీ చేస్తారు.
ఇదంతా చూసినప్పుడు ఒక రైలుకు టికెట్ల జారీలో తక్కువలో తక్కువ నాలుగైదు వందల వరకూ వెయిటింగ్ లిస్టు టికెట్లు జారీకి రంగం సిద్ధం చేసినట్లు చెప్పాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతో ముఖ్యమైతే తప్పించి ప్రయాణానికి సిద్ధం కారు. అంటే.. రిజర్వు చేయించుకున్న తర్వాత క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉండదు. అలాంటప్పుడు వెయిటింగ్ లిస్టు టికెట్లు జారీ చేయటం వల్ల రైల్వే శాఖకు ప్రయోజనం కలుగుతుంది తప్ప.. ప్రయాణికుడికి లాభం తక్కువేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.