Begin typing your search above and press return to search.
ప్రధానిగా మోడీ ఉన్న వేళలోనూ 5 రోజులు వెయిట్ చేయటమా?
By: Tupaki Desk | 1 Dec 2020 3:30 AM GMTప్రధాని పీఠం మీద ఉన్నది నరేంద్ర మోడీ. ఇప్పటివరకు ప్రధానమంత్రులుగా పని చేసిన వారందరికి ఆయన భిన్నమైన వ్యక్తిత్వం అని.. యావత్ దేశంలో ఏ మూల చీమ చిటుక్కుమన్నా.. చటుక్కున తెలిసిపోతుందన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. సమస్యలపై ఆయన స్పందించే తీరు భిన్నంగా ఉంటుందంటూ జానపదాల్లో కథానాయకుడ్ని వర్ణించినట్లుగా మోడీ గొప్పతనం గురించి కథలు కథలుగా చెబుతుంటారు. మరి.. అంతటి మోడీ ప్రధానిగా ఉన్న వేళ.. తమ సమస్యలపై రైతాంగం వినూత్నంగా ఉద్యమించటమే కాదు.. వణికించే చలిలో ఢిల్లీ శివారులో మూడు రోజులు వెయిట్ చేయాల్సి రావటం ఏమిటి? అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది?
దేశ చరిత్రలో చాలా అరుదుగా మాత్రమే చోటు చేసుకునే రైతు ఆందోళన తాజాగా చోటుచేసుకోవటమే కాదు.. యావత్ దేశం చూపును తమ మీద పడేలా చేశారు రైతులు. ఇటీవల కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాల్ని నిరసిస్తూ.. చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టటమే కాదు.. భద్రతాబలగాలు వారిని దేశ రాజధానిలోకి రానివ్వకుండా అడ్డుకోవటంతో.. వేలాది మంది సరిహద్దుల్లోనే మూడు రోజులుగా నిరీక్షిస్తున్నారు. తమతో పాటు.. రెండు నెలలకు సరిపడా ఆహార సామాగ్రిని వెంట తెచ్చుకున్నట్లుగా వార్తలు వచ్చాయి.
దారుణమైన విషయం ఏమంటే.. అంత భారీగా రైతాంగం కదిలి వచ్చినప్పుడు.. స్వయంగా ప్రధానమంత్రి (పీఎం కుర్చీలో ఉన్నది మోడీ కాబట్టి మాత్రమే ఈ మాట చెబుతున్నాం) ముందుకు వచ్చి వారి కష్టనష్టాల మీదా.. వారి వాదనల్ని ఓపిగ్గా విని.. నిర్ణయం తీసుకుంటే ఎంత బాగుండేది? అందుకు భిన్నంగా వారు ఐదు రోజులు వణికించే చలిలో ఆందోళన చేపట్టారు. తాజాగా వారితో ప్రభుత్వంతో ఈ రోజు చర్చలు జరిపనుంది. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే.. ప్రభుత్వ వాదన వేరుగా ఉంది. వణికే చలి నేపథ్యంలో రెండు రోజుల ముందే చర్చలకు రావాలని కోరామని.. కానీ వారు ముందుకు రాలేదని చెబుతున్నారు.
అదే నిజం అనుకున్నా.. రెండు రోజులు కూడా ఎందుకు వెయిట్ చేయించాలి? వారో ప్రవాహంలా ఢిల్లీకి తరలి వస్తున్న వేళ.. అన్నదాతలు అంత కష్టపడకండి.. మీ సమస్యల గురించి మీతో చర్చిస్తామని చెప్పి.. మొగ్గలోనే ఈ ఇష్యూను తుంచేయొచ్చు కదా? ఒకవేళ.. వారి సమస్యలు దేశం మొత్తానికి తెలియాలన్నదే వారి ఉద్దేశం అయితే.. నిండు మనసుతో.. ఆందోళన చేస్తున్న రైతులకు వసతి ఏర్పాట్లతో పాటు.. మిగిలిన ఏర్పాట్లు ప్రభుత్వమే చేసి ఉంటే ఎలా ఉండేది? అలా ఎలా చేస్తారన్న సందేహం రావొచ్చు. కానీ.. ప్రధాని కుర్చీలో ఉన్నది మోడీ అన్నది మర్చిపోకూడదు.
తమ డిమాండ్లను సాధించే వరకు వెనక్కి వెళ్లేది లేదని భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు నరేశ్ తికాయత్ తేల్చి చెబుతున్నారు. రిపబ్లిక్ డే (జనవరి 26 వరకు) అవసరమైన సరుకుల్ని తమ వెంట తెచ్చుకున్నామని.. తమ డిమాండ్లను ఆమోదించే వరకు వెనక్కి వెళ్లేది లేదని తేల్చారు. అవసరమైతే ఢిల్లీకి వెళ్లే ఐదు రహదారుల్ని కూడా దిగ్భందిస్తామని ఆయన తేల్చి చెబుతున్నారు.ఇదిలా ఉంటే.. మోడీ సర్కారుకు రైతు ఆందోళన సెగ తగులుతోంది. రైతుల కోసం మాట్లాడండి అని కాంగ్రెస్ సోషల్ మీడియాలో ప్రచారం మొదలెడితే.. ఐదు వామపక్ష పార్టీలైన సీపీఐ.. సీపీఎం.. ఆర్ఎస్ పీ.. ఏఐఎఫ్ బీ.. సీపీఐ (ఎంఎల్) మద్దతు తెలిపాయి. ఇదిలా ఉంటే.. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోకుంటే ఎన్డీయే నుంచి వైదొలుగుతామని ఆర్ఎల్ పీ అధ్యక్షుడు కమ్ నాగౌర్ ఎంపీ హనుమాన్ బేనీవాల్ హెచ్చరిస్తున్నారు. ఆ పార్టీ తరఫున ఆయన ఒక్కరే ఎంపీ. కాకుంటే.. ఆయన పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు రాజస్తాన్ లో ఉన్నారు. మొత్తంగా అంతకంతకూ పెరుగుతున్న రైతాంగ నిరసనలకు ప్రభుత్వం కాస్త మెత్తబడింది. మరి.. చర్చలు ఫలవంతం అవుతాయా? లేదా? అన్నది చూడాలి.