Begin typing your search above and press return to search.
అమ్మ ఏడ్చింది: ఉగ్రవాది తుపాకీ వదిలేశాడు
By: Tupaki Desk | 18 Nov 2017 6:24 AM GMTఅవును ఉగ్రవాదులకు కూడా మనసు ఉంటుంది. అలా మనసు ఉండటం వల్లే దాన్ని మాలిన్యం చేసి...ఏదో ఒక బలహీన క్షణంలో తుపాకీ పట్టించడమే కొందరు చేసే పని. అయితే అలా తుపాకీ పట్టిన ఓ ఉగ్రవాది తన తల్లి కోరిక మేరకు తిరిగి జనజీవన స్రవంతిలో కలిశాడు. తను ప్రాణంగా ప్రేమించిన - తనకు గుర్తింపు నిచ్చిన ఫుట్ బాల్ ఆటను తిరిగి కొనసాగించేందుకు సిద్ధమయ్యాడు. తన ఆప్తమిత్రుడి ఎన్ కౌంటర్ ను తట్టుకోలేక ఉగ్రవాద సంస్థలో చేరిన ఓ క్రీడాకారుడు.. తల్లి కన్నీళ్లకు చలించి మళ్లీ జనజీవన స్రవంతిలో కలిసిపోయాడు.
అనంతనాగ్ లోని ఫుట్ బాల్ జట్టు గోల్ కీపర్ - స్థానిక కళాశాల విద్యార్థి అర్షద్ అత్యంత సన్నిహిత స్నేహితుడైన యావర్ నిస్సార్ షెర్గుజ్రీ అనే మిలిటెంట్.. ఈ ఏడాది ఆగస్టులో భద్రతాదళాల ఎన్ కౌంటర్లో హతమయ్యాడు. దీంతో కలత చెందిన అర్షిద్ వారం కిందట లష్కరేలో చేరాడు. అతని స్నేహితులు - తల్లిదండ్రులను కలిసిన పోలీసులు.. ఎలాగైనా అర్షద్ ను తిరిగి ఇంటికి వచ్చేలా చూడాలని కోరారు. దీంతో లొంగిపోవాలని టెలివిజన్ - ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా అర్షద్ తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. `ఇంటికి వచ్చెయ్ బాబు...` అంటూ అర్షిద్ తల్లి ఆసియా ఖాన్ ఏడుస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. ఈ నేపథ్యంలో అర్షిద్ ఉగ్రవాదాన్ని వదిలిపెట్టి సైన్యం ముందు లొంగిపోయాడు.
ఇటీవల లష్కరే తాయిబాలో చేరిన కళాశాల విద్యార్థి - ఫుట్ బాల్ క్రీడాకారుడు మాజిద్ అర్షిద్ భద్రతాదళాల ఎదుట లొంగిపోయినట్టు ఆర్మీ అధికారులు తెలిపారు. గురువారం రాత్రి దక్షిణ కశ్మీర్ లోని సైనిక శిబిరం వద్దకు నడుచుకుంటూ వచ్చిన అర్షిద్.. ఆయుధాలు - మందుగుండు సామగ్రితో లొంగిపోయాడన్నారు. కాగా, లష్కరే తాయిబాలో చేరిన ఫుట్ బాల్ క్రీడాకారుడు అర్షద్ ను అమ్మ ప్రేమే తిరిగి ఇంటికి రప్పించిందని జమ్ముకశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ చెప్పారు.