Begin typing your search above and press return to search.

ఉగ్రవాదుల వెన్నులో వణుకుపుట్టిస్తోన్న మహిళ!

By:  Tupaki Desk   |   30 Sep 2016 2:30 PM GMT
ఉగ్రవాదుల వెన్నులో వణుకుపుట్టిస్తోన్న మహిళ!
X
ఇరాక్‌లో ఇస్లామిక్‌ స్టేట్‌ - అల్‌ ఖైదా తీవ్రవాద సంస్థలు ఓ మహిళా పేరు చెబితే పోసేసుకుంటున్నాయట! ఆమె పోరాట పఠిమ చూసి తడిపేసుకుంటున్నాయట! దీంతో ఈ పోరాట యోధురాలిని చంపడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాయట! అవునా... ఆ మహిళ అంత శక్తివంతురాలా? అంతకు మించిన శక్తివంతురాలే!! ఉగ్రవాదుల చేతిలో కుటుంబాన్ని పోగొట్టుకున్న ఆ మహిళ... ఇప్పుడు అదే ఉగ్రవాదుల వెన్నులో వణుకుపుట్టిస్తోంది. తన చేతికి చిక్కిన ఉగ్రవాదుల తలలు ఒక్క దెబ్బతో నరికేసి - కూరొండేస్తుంది!! ఈ స్థాయిలో ఉగ్రవాదులపై కక్షగట్టిన - ఉగ్రవాదులను భయపెడుతున్న ఆ మహిళ గురించి ఇప్పుడు తెలుసుకుందాం!

ఇరాక్ లోని ఓ ఊళ్లో తన కుంటుంబంతో సంతోషంగా కాలం గడుపుతోంది వహీదా మహమ్మద్ అలియాస్ ఉమ్ హనది అనే మహిళ. ఇంతలోనే ఆమె కుటుంబాన్ని అల్ కాయిదా - ఐసిస్ ఉగ్రమూకలు సర్వనాశనం చేశాయి. వారు చేసిన దాడుల్లో వహీదా తండ్రి - భర్త - ముగ్గరు సోదరులు చనిపోయారు. దీంతో ఉగ్రవాదులపై కక్ష పెంచేసుకుంది వహిదా. ఎట్టిపరిస్థితుల్లోనూ ఉగ్రవాదులపై పగతీర్చుకోవాలనుకున్న ఆమె అందుకోసం 2004లో ఇరాకీ సైన్యంలో చేరారు. ఈ క్రమంలో తనకు ఎవరైనా ఉగ్రవాదులు చిక్కితే వారికి తనమార్కు శిక్ష విధిస్తుంది. ఆ ఉగ్రమూకల తలలు నరికి వాటిని వండెస్తుందట! ఈ మేరకు ఇప్పటికే పలు రిపోర్టులు వచ్చాయట! ఆ రిపోర్టులకు బలం చేకూరుస్తూ... నరికి తలలను చేతులతో పట్టుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసింది.

కాగా, ఈమెపై ఉగ్రవాదులు ఎన్నోసార్లు దాడులు జరిపైనా... వెంట్రుకవాసిలో ఈమె తప్పించుకోగలిగారు. 2006 - 2009 - 2010 - 2013 - 2014 సంవత్సరాలలో ఆమెపై ఏకంగా కారుబాంబు దాడి జరిగినా, ఇలా సుమారు ఆరు సార్లు హత్యా ప్రయత్నాలు జరిగినా ఆమె తప్పించుకున్నారు. ఐసిస్ చీఫ్ బాగ్దాదీ సైతం "'ఆమెకు దొరకకుండా జాగ్రత్త పడండి" అని ఉగ్రవాదులను హెచ్చరించాడంటే ఆమె వాళ్లను ఏస్థాయిలో వణికిస్తుందో అర్ధమవుతుంది! ప్రస్తుతం ఈమె ఇరాకీ మిలటరీలో కమాండర్ హోదాలో పనిచేస్తుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/