Begin typing your search above and press return to search.

ఉద్యోగుల సమ్మె సమయంలో పడిన జీతాలు.. కొందరికి రెండు సార్లు

By:  Tupaki Desk   |   10 Feb 2022 3:00 PM IST
ఉద్యోగుల సమ్మె సమయంలో పడిన జీతాలు.. కొందరికి రెండు సార్లు
X
ఉద్యోగుల సమ్మె వేళ చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ట్రెజరీ ఉద్యోగులు కూడా సమ్మెలో ఉండడంతో జీతాల చెల్లింపు వ్యవహారం గందరగోళంగా మారింది. చిత్తూరు జిల్లాలో ఉద్యోగుల సమ్మె కొందరికీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఉద్యోగుల సమ్మెతో నేరుగా ఉద్యోగులకు సీఎఫ్ఎంఎస్ ద్వారా జమ అయిన జీతాల్లో గందరగోళంనెలకొంది.

జిల్లాలోని నలుగురు ఐఏఎస్ అధికారులకు రెండు జీతాలు జమ అయినట్లు గుర్తించి రికవరీ చర్యలు చేపట్టారు. మరోవైపు కొందరు ఉద్యోగుల బ్యాంక్ ఖాతాల్లో జీాలే పడని పరిస్థితి నెలకొంది. జిల్లాలో 50678 ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా.. ఇప్పటికీ జనవరి నెల జీతాలు అందక కొందరు ఇబ్బందులు పడుతున్నారు. డిసెంబర్ లో రిటైర్డ్ అయిన వారికి, సస్పెన్షన్ లో ఉన్న వారికి.. సెలవుల్లో ఉన్నవారికి కూడా జనవరి నెల జీతం వచ్చింది.

ఉద్యోగుల సమ్మె కారణంగా బ్యాంకు ఖాతాల్లో డబ్బులు తప్పు తప్పులుగా పడడంతో సంబంధిత ట్రెజరీ సిబ్బంది హడావుడిగా దిద్దుబాటు పనులు చేపట్టింది. ఈ వ్యవహారం ఇప్పుడు తలనొప్పిగా మారింది. సర్వీసులో లేని వారి ఖాతాల్లో పడ్డ డబ్బులు వారి వివరాలు సేకరించడం తలకు మించిన భారమైంది.

ఇక మరో విచిత్రం ఏంటంటే.. చనిపోయిన వారికి కూడా జీతాలు జమ అయ్యాయి. వారి వివరాలు సేకరిస్తున్న అధికారులు జీతాల చెల్లింపులో జరిగిన పొరపాట్లపై నివేదిక అందజేయాలని ప్రభుత్వం నుంచి ట్రెజరీ ఉద్యోగులకు ఆదేశాలు అందాయి.

ఇక పోలీస్ శాఖలోని ఉద్యోగులకు ఎలాంటి కటింగులు లేకుండా మొత్తం గ్రాస్ సాలరీ పడిపోగా.. వాళ్ల ఖాతాల నుంచి తిరిగి చలానా రూపంలో డబ్బులు రికవరీ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.