Begin typing your search above and press return to search.
మైకెల్ క్లార్క్ ఆరోపణల్ని తిప్పికొట్టిన వీవీఎస్ లక్ష్మణ్
By: Tupaki Desk | 16 April 2020 11:30 PM GMTఐపీఎల్ కాంట్రాక్ట్ అంశంపై ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మైకెల్ క్లార్క్ చేసిన ఆరోపణలను మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ తిప్పికొట్టారు. ఐపీఎల్ కాంట్రాక్ట్ దక్కడానికి కొందరితో స్నేహంగా ఉన్నంత మాత్రాన దక్కదని స్పష్టం చేశారు. ఐపీఎల్ కాంట్రాక్ట్ దక్కించుకోవడం కోసం ఆస్ట్రేలియా క్రికెటర్లు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో మంచిగా ఉండడానికి ప్రయత్నించారని, అతణ్ని స్లెడ్జింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మైకెల్ క్లార్క్ ఇటీవల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అతడివ్యాఖ్యలను భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ తప్పు పట్టాడు. భారత జట్టు ఆటగాళ్లతో స్నేహం ఉన్నంత మాత్రాన వారికి ఐపీఎల్ కాంట్రాక్టు లభిస్తుందని అనుకోవడం హాస్యాస్పదమే అని తెలిపారు.
స్టార్ స్పోర్ట్స్ 'క్రికెట్ కనెక్టెడ్' షోలో పాల్గొన్న లక్ష్మణ్ క్లార్క్ ఆరోపణలపై స్పందించారు. ఎవరితోనో మంచిగా ఉన్నంత మాత్రాన ఐపీఎల్ టోర్నీలో చోటు దక్కదని స్పష్టం చేశారు. జట్టులోకి తీసుకోవడానికి ఏ ఫ్రాంఛైజీ అయినా ఆటగాడి సామర్థ్యం, అతడు జట్టుకు ఎంత విలువను చేకూరుస్తాడన్నది చూస్తుందని తెలిపారు. మ్యాచ్‌లు గెలిపిస్తారనుకునే ఆటగాళ్ల వైపే ఫ్రాంఛైజీ మొగ్గు చూపుతుందని, అలాంటి ఆటగాళ్లకే ఐపీఎల్ కాంట్రాక్టులు దక్కుతాయని చెప్పారు. అంతే కానీ.. ఎవరితోనో మంచిగా ఉంటే కాంట్రాక్టులు రావు' అని పేర్కొన్నాడు.
ఏ భారత ఆటగాడితోనైనా ఓ విదేశీ ప్లేయర్ స్నేహంగా ఉన్నాడంటే.. దానర్థం అతడికి ఐపీఎల్ కాంట్రాక్టు వస్తుందని కాదని, ఇది మనం ఆలోచించే విధానంలో ఉంటుందని తెలిపారు. మార్గనిర్దేశకుడిగా తాను ఐపీఎల్ వేలంలో పాల్గొన్నానని, తమ తమ దేశాల తరఫున బాగా ఆడిన విదేశీ ఆటగాళ్లనే తాము ఎంపిక చేసినట్లు వివరించారు. అంతేకాని విరాట్ కోహ్లీతో మంచిగా ఉన్నాడని ఎంపిక చేయలేదని స్పష్టం చేశారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ కు లక్ష్మణ్ మార్గ నిర్దేశకుడిగా ఉన్న విషయం తెలిసిందే.
లక్ష్మణ్‌తో పాటు భారత మాజీ ఓపెనర్ క్రిస్ శ్రీకాంత్ కూడా క్లార్క్ ఆరోపణలను తిప్పికొట్టాడు. క్లార్క్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా అనిపించాయని తెలిపారు. మీరు స్లెడ్జింగ్ చేయడం ద్వారా మ్యాచ్‌లను గెలవరని, అది ఆస్ట్రేలియాకే నష్టమని చెప్పారు. తన అభిప్రాయం ప్రకారం స్లెడ్జింగ్ ఏ విధంగానూ సహాయపడదని పేర్కొన్నారు. వికెట్లు తీయడానికి బాగా బౌలింగ్ చేయాలి, లక్ష్యాలను సాధించడానికి బాగా బ్యాటింగ్ చేయాలి అని శ్రీకాంత్ తెలిపారు.