Begin typing your search above and press return to search.

ఇలా ఆడితే జట్టులో చోటు గల్లంతే.. గిల్ పై వీవీఎస్​ లక్ష్మణ్ విమర్శలు

By:  Tupaki Desk   |   5 March 2021 9:53 AM GMT
ఇలా ఆడితే జట్టులో చోటు గల్లంతే.. గిల్ పై వీవీఎస్​ లక్ష్మణ్  విమర్శలు
X
ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుతంగా రాణించిన శుభ్​మన్​ గిల్​ స్వదేశీ టోర్నీల్లో మాత్రం తేలిపోతున్నాడు. గురువారం నుంచి మొదలైన నాలుగో టెస్ట్​ తొలి ఇన్సింగ్స్ లో రనౌట్​ అయ్యాడు. దీంతో అతడి ఆటతీరుపై విమర్శలు వస్తున్నాయి. గిల్​ ఇలాగే ఆడితే కష్టమని సీనియర్​ క్రికెటర్లు వ్యాఖ్యానిస్తున్నారు. స్వదేశాల్లో ఇంక అతడిని తీసుకోకపోవచ్చని అంటున్నారు.

ఆసీస్‌ పర్యటనలో గిల్​ దుమ్ముదులిపాడు. అర్థసెంచరీలతో చెలరేగిపోయాడు.సొంతగడ్డమీద మాత్రం తేలిపోతున్నాడు. ఇంగ్లాండ్​ సీరిస్​ మొదటి టెస్ట్​లో మాత్రం హాఫ్​ సెంచరీ చేసిన గిల్​ ఆ తర్వాత ఒక్కమ్యాచ్ లోనూ రాణించలేదు.గిల్​ పరుగుల క్రమం ఇలా ఉంది. 0, 14, 11,15*,0 పరుగులు గిల్​ కొట్టాడు. దీంతో అతడిపై విమర్శలు జోరందుకున్నాయి.అయితే తాజాగా గిల్​ ఆటతీరుపై వీవీఎస్​ లక్ష్మణ్​ స్పందించాడు.

' గిల్​ ఆటతీరులో ఏదో లోపం ఉంది. దాన్ని అతడు సరిచేసుకోవాలి. ఆస్ట్రేలియాలో అంత చక్కటి ఇన్సింగ్స్​లు ఆడిన గిల్​ స్వదేశంలో ఎందుకు తేలిపోతున్నాడో అర్థం కావడం లేదు. మొదటి రెండు టెస్టులు జరిగింది చెన్నైలో అక్కడితో పోలిస్తే అహ్మాదాబాద్​ పిచ్​ కాస్త ప్లాట్​గా ఉంది. అక్కడ గిల్​ కాసేపు ఓపికపడితే మంచి ఇన్సింగ్స్​ ఆడేవాడు. అతడు ఇలాగే ఆడితే మాత్రం వేటు తప్పదు. ఎందుకంటే గిల్​ ప్లేస్​లోకి వచ్చేందుకు కేఎల్​ రాహుల్​, మయాంక్ అగర్వాల్​ ఎదురుచూస్తున్నారు. కాబట్టి గిల్​ ఇప్పటికైనా శ్రద్ధ పెట్టాలి' అని లక్ష్మణ్​ పేర్కొన్నాడు.

నాలుగో టెస్టులో ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 205 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. మరోసారి స్పిన్నర్లు విజృంభించారు. అక్షర్‌ పటేల్‌ 4 వికెట్లు, అశ్విన్‌ 3 వికెట్లతో సత్తా చాటగా.. సిరాజ్‌ రెండు వికెట్లు తీశాడు. ప్రస్తుతం టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 66 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు సాధించింది. పంత్ (68 బంతుల్లో 44) సుందర్ తో కలసి పోరాడుతున్నాడు.